మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక, ఉద్యోగ విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకు న్నట్లు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలను కొనసాగించడం వల్ల లాభం ఉంటుంది. వృత్తి, వ్యాపా రాల్లో కీలక మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆద రణ లభిస్తాయి. నిరుద్యోగులకు కొన్ని మంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబంలో అనుకో కుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం మీద వీలైనంతగా శ్రద్ధ పెట్టడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆశించిన గుర్తింపు లభించి డిమాండ్ పెరు గుతుంది. వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పురోగమిస్తాయి. కుటుంబ జీవితం ఉత్సా హంగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడు తుంది. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారాన్ని అందుకుంటారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు కలుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాల్లో రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పిల్లలు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పురోగతి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ప్రాభవం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇతరుల పనుల మీద కన్నా సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. గట్టి పట్టుదలతో వ్యక్తిగత సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదంలో రాజీమార్గాన్ని అనుసరిస్తారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంతో శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. సొంత బాధ్యతలను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది కానీ, వృథార ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు కొత్త లక్ష్యాల్ని అప్ప గించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు అభివృద్ది బాటపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. నిరుద్యో గులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదురు తుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొందరు మిత్రులకు అండగా ఉంటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
శ్రమ ఎక్కువగానూ ఫలితం తక్కువగానూ ఉంటుంది. ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు, సమ స్యలు తప్పకపోవచ్చు. విధి నిర్వహణలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కొత్త ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల లాభం ఉంటుంది. ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తి కరంగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలతో పాటు, ఉద్యోగం మారే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. కొందరు మిత్రులతో విందులో పాల్గొంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫల మవుతాయి. వృత్తి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చి చేరే అవకాశం ఉంది. వ్యాపారం ఆశించిన విధంగా పురోగమిస్తుంది. కుటుంబ జీవితం ప్రశాం తంగా సాగిపోతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. బంధు వులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకునే అవకాశం ఉంది. కొందరు మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులుంటాయి. కుటుంబ జీవితం బాగా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలు బాగా బిజీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయి. కొద్దిగా సానుకూల దృక్ప థంతో వ్యవహరించడం మంచిది. పిల్లలు పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామికి ఆకస్మిక ధన లాభం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. మిత్రులు ఆర్థికంగా కొద్దిగా ఇరకాటంలో పెట్టే అవకాశముంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.