Home Loan: 20 ఏళ్ల హోమ్ లోన్ 13 ఏళ్లల్లోనే తీర్చవచ్చు.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీపై ఆర్ధిక భారం తగ్గినట్లే..

Home Loan: 20 ఏళ్ల హోమ్ లోన్ 13 ఏళ్లల్లోనే తీర్చవచ్చు.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీపై ఆర్ధిక భారం తగ్గినట్లే..


సొంతిల్లు నిర్మించుకోవాలనేది ప్రతీఒక్కరి జీవితకాలపు కల. తమ కలను నిజం చేసుకునేందుకు తాము కష్టించి సంపాదించిన సొమ్మును కూడబెట్టుకుంటూ ఉంటారు. అయితే ముడి సరుకు ధరలన్నీ పెరిగిన క్రమంలో ఇప్పట్లో ఇల్లు నిర్మించడం పెద్ద భారంగా మారింది. సొంతింటి కోసం రూ.లక్షల ఖర్చు అవుతుంది. సామాన్యుడి దగ్గర అంత డబ్బులు ఉండవు. దీంతో బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. గృహ రుణం కాలపరిమితి 20 ఏళ్ల వరకు ఉంటుంది. అయితే 20 ఏళ్ల పాటు ఈఎంఐ చెల్లించుకుంటూ ఉంటే వడ్డీ ఎక్కువ అవ్వడంతో పాటు ఆర్ధిక భారం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల 13 నుంచి 14 ఏళ్లల్లో హోమ్ లోన్ తిరిగి చెల్లించవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ మూడు మార్గాలు

ఉదాహరణకు మీరు 20 ఏళ్లల్లో చెల్లించడానికి 8.5 శాతం వడ్డీతో రూ.40 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారనుకుందాం. మీకు నెలకు ఈఎంఐ రూ.34,678 పడుతుంది. మీరు 20 ఏళ్ల పాటు చెల్లిస్తూ ఉంటే రూ.83 లక్షలు కూడబెడతారు. అదే మీరు 13 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలంటే ఈఎంఐను పెంచుకోవాల్సి ఉంటుంది. ఈఎంఐ రూ.44,200కి పెంచుకుంటే 13 ఏళ్లకు రూ.68,95,200 అవుతుంది. ఈ విధానంలో మీకు రూ.14,27,520 వడ్డీ ఆదా అవుతుంది. ఇక ఇదే కాకుండా ప్రతీ ఏడాది ముందుగా చెల్లించే పద్దతి మరోకొటి ఉంది. ఈఎంఐ రూ.34,678 ఉండగా.. సంవత్సరానికి రూ.2 లక్షలు ముందే చెల్లించండి. దీని వల్ల కాలపరిమితి 13 సంవత్సరాలకు తగ్గుతుంది. ముందుగా చెల్లించడం వల్ల ఈఎంఐల సంఖ్య తగ్గుతుంది. దీని వల్ల రూ.6 నుంచి రూ.8 లక్షల వరకు వడ్డీ ఆదా అవుతుంది. ఇక ఈఎంఐ చెల్లింపులు, ముందస్తు చెల్లింపులు రెండూ ఎంచుకోవడం వల్ల కూడా లాభం జరుగుతుంది. దీని వల్ల రూ.13 నుంచి రూ.14 లక్షల వరకు మీకు ప్రయోజనం ఉంటుంది.

ఈఎంఐ తగ్గించుకోవడం ఎలా..?

అలాగే మీరు ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఎంచుకుంటే ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గించినప్పుడలా మీకు ఈఎంఐ తగ్గుతుంది. దీంతో బ్యాంక్‌కు వెళ్లి ఈఎంఐ తగ్గించమని అడగండి. దీంతో బ్యాంకులు వడ్డీ రేటు తగ్గించడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. ఇక ఏదైనా బ్యాంకులు వడ్డీ రేటు తక్కువగా ఉంటే.. ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్‌కు మీ లోన్‌ను బదిలీ చేసుకోండి. దీన వల్ల కూడా మీకు లాభం ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *