Headlines

Health Tips: మార్నింగ్ లేవగానే టీ తాగుతున్నారా?.. ఇది తెలియపోతే మీరు డెంజర్‌లో పడ్డట్టే!

Health Tips: మార్నింగ్ లేవగానే టీ తాగుతున్నారా?.. ఇది తెలియపోతే మీరు డెంజర్‌లో పడ్డట్టే!


మార్నింగ్ లేవగానే నేరుగా టీ తాగడం చాలా మందికి అలవాటు, మరి కొందరైతే నేరుగా బెడ్‌పై పడుకునే టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. ఇది ఎన్నో రోజులుగా చాలా మంది ఫాలో అవుతున్న రోటీన్. అయితే ఈ అలవాటు చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది తీవ్రమైన ఆరోగ్య సమ్యలకు దారి తీయవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఈ అలవాటు ఇలాగే కొనసాగితే ఎలాంటి సమస్యలు వస్తాయి. వాటిని భారీన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

ఖాళీ కపుడతో టీ తాగితే ఏం జరుగుతుంది?

కిడ్నీ స్టోన్స్: టీలో సహజంగానే ఆక్సలేట్లు ఉంటాయి. ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు, ఈ కాంపౌండ్స్ నేరుగా కిడ్నీలకు చేరుకుంటాయి. ఇవి శరీరంలోని కాల్షియంతో కలిసి స్పటికాలుగా మారి, కాలక్రమేణా కిడ్నీ స్టోన్స్‌గా మారుతాయి.

డీహైడ్రేషన్: టీ ఒక డైయూరిటిక్. అంటే ఇది శరీరం నుండి నీటిని బయటకు పంపుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి, రక్తాన్ని శుద్ధి చేయడానికి కిడ్నీలు మరింత కష్టపడాల్సి వస్తుంది.

రక్తపోటు: టీలోని కెఫీన్ ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు రక్తపోటును అకస్మాత్తుగా పెంచుతుంది. ఇది దీర్ఘకాలంలో కిడ్నీలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది.

జీర్ణక్రియ: టీ ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. ఖాళీ కడుపుతో తాగడం వల్ల కడుపులోని పిత్త రసాల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు, వికారం, మంట కలుగుతాయి.

బ్లాక్ టీ లేదా పాలు కలిపిన టీ.. ఏది మంచిది?

కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి టీ తాగే సమయం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ న్యూట్రిషన్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. మిల్క్ టీ వల్ల మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం కొద్దిగా తగ్గుతుందని చెబుతున్నారు. ఎందుకంటే పాలలోని కాల్షియం, కడుపు, ప్రేగులలో టీలోని ఆక్సలేట్‌లతో కలుస్తుంది. దీనివల్ల ఆక్సలేట్‌లు మూత్రపిండాలకు చేరకముందే శరీరం నుండి విషపదార్థాలతో పాటు విసర్జించబడతాయి. ఆహారం లేదా పాల ఉత్పత్తులతో పాటు ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *