Headlines

Guru Gochar 2027: గురుడి అనుగ్రహంతో వీరికి మహర్దశ.. ధనలాభం, కెరీర్‌లో ఊహించని పురోగతి!


Guru Gochar 2027 Effect: 2027లో దేవగురువు బృహస్పతి (గురుడు) మూడు సార్లు రాశి మారనున్నాడు. జ్యోతిషశాస్త్రంలో గురు గ్రహాన్ని జ్ఞానం, విద్య, సంపద, సంతానం, అదృష్టానికి కారకుడిగా పరిగణిస్తారు. గురుడి అనుకూల సంచారం జీవితంలో అభివృద్ధి, ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని జ్యోతిష్య నమ్మకం. 2027లో గురుడి రాశి మార్పులు కొన్ని రాశుల వారికి విశేషంగా కలిసివచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి.

2027 జనవరి 25న గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం జూన్ నెలలో సింహ రాశిలోకి, నవంబర్‌లో కన్యా రాశిలోకి మారనున్నాడు. ఈ మూడు సంచారాలు మొత్తం 12 రాశులపై వేర్వేరు ప్రభావాలను చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గురుడి రాశి మార్పు ప్రభావంతో 2027లో అనుకూల ఫలితాలు పొందే 4 అదృష్ట రాశులేవో తెలుసుకుందాం.

కర్కాటక రాశి (Cancer)

2027 ప్రారంభం కర్కాటక రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో గురుడు మీ రాశిలోనే సంచరిస్తాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురుడికి కర్కాటక రాశి ఉచ్ఛస్థానం. దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ, వృత్తి జీవితంలో ముందుకు వెళ్లేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక విషయాల్లోనూ ఉపశమనం, ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి



సింహ రాశి (Leo)

సింహ రాశి వారికి 2027 జూన్ తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ నెలలో గురుడు మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతమవుతాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రణాళికలను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంస్థలో లేదా కోరుకున్న ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. జూన్ నుంచి నవంబర్ వరకు కెరీర్, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. పొదుపు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి.

కన్యా రాశి (Virgo)

కన్యా రాశి వారికి 2027 చివరి దశ కొత్త అవకాశాలను తీసుకురానుంది. నవంబర్‌లో గురుడు మీ రాశిలోకి ప్రవేశించడంతో వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకోవచ్చు. విదేశాల్లో ఉద్యోగం చేయాలని లేదా ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామ్యాలు లాభదాయకంగా మారతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సంవత్సరం చివర్లో అనుకూల పరిణామాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి.

ధనుస్సు రాశి (Sagittarius)

ధనుస్సు రాశికి అధిపతి గురుడే. 2027లో గురుడి సంచారం మీ జాతకంలోని తొమ్మిది, పదో స్థానాలకు సంబంధించిన అంశాలపై ప్రభావం చూపనుంది. దీంతో వృత్తి, ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో ఈ సంవత్సరం ప్రయోజనకరంగా ఉండే అవకాశముంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, దైవ సంబంధిత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చాలాకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు తగ్గడంతో పాటు ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడుతాయి.

మీన రాశి (Pisces)

2027లో గురుడి రాశి మార్పు మీన రాశి వారికి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరవనుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మనసుకు నచ్చిన ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కంటే స్పష్టతతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే పెట్టుబడులకు ముందు నష్టభయాలను అంచనా వేయడం అవసరం. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. తద్వారా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. సంవత్సరం చివరి నెలల్లో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *