GT vs KKR Playing XI: టాస్ గెలిచిన కేకేఆర్.. తొలి గెలుపు దక్కేనా.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..

GT vs KKR Playing XI: టాస్ గెలిచిన కేకేఆర్.. తొలి గెలుపు దక్కేనా.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..


IPL గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ Playing XI: ఐపీఎల్ 2026లో భాగంగా 25వ మ్యాచ్ నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని గుజరాత్ సొంత మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలైంది. ఈ మేరకు టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ టీం ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ గత మ్యాచ్‌తో పోలిస్తే తుది జట్టులో ఒక మార్పు చేసింది. ఫిల్ అలెన్ స్థానంలో టిమ్ సీఫెర్ట్‌ను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు, గుజరాత్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.

ఈ సీజన్‌లో కేకేఆర్ ఐదు మ్యాచ్‌లు ఆడగా, వాటిలో నాలుగు ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. జీటీ నాలుగు మ్యాచ్‌లు ఆడగా, వాటిలో రెండు గెలిచి, రెండు ఓడిపోయింది. గుజరాత్ టీం తమ చివరి రెండు మ్యాచ్‌లలో ఢిల్లీ, లక్నోలను ఓడించింది.

ఇరుజట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *