Gold, Silver Prices: గత వారంలో బంగారం, వెండి ధరలలో గణనీయమైన మార్పు కనిపించింది. ఈ రెండు విలువైన లోహాల ధరలు పెరిగాయి. అయితే, ఐదు రోజుల పెరుగుదల తర్వాత కూడా MCXలో బంగారం ధర దాని ఆల్-టైమ్ హై కంటే 10 గ్రాములకు రూ.48,000 పైగా తక్కువగా ఉంది. వెండి ధర కూడా దాని ఆల్-టైమ్ హై కంటే రూ.1.81 లక్షలు తక్కువగా ఉంది. గత ఐదు ట్రేడింగ్ రోజులలో 1 కిలో వెండి ధర రూ.14,000 పైగా పడిపోయింది.
ముందుగా వెండి ధర గురించి మాట్లాడుకుందాం.. మే 5వ తేదీన గడువు ముగియనున్న MCXలోని వెండి ధర గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో రూ.14,805 పెరిగింది. ఏప్రిల్ 10న 1 కిలో వెండి ధర రూ.2,43,274 ఉండగా, గత శుక్రవారం అది కిలోకు రూ.2,58,079 వద్ద ముగిసింది.
వారం రోజుల పాటు పెరిగినప్పటికీ, వెండి ధరలు దాని గరిష్ట స్థాయిలతో పోలిస్తే పడిపోతున్నాయి. ఈ ఏడాది జనవరిలో MCXలో వెండి ఫ్యూచర్స్ తొలిసారిగా రూ. 4 లక్షలను దాటాయి. అలాగే ఈ విలువైన లోహం కిలోకు రూ. 4,39,337 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. ఈ స్థాయికి చేరుకున్నప్పటి నుండి తగ్గుతూ,కిలోకు రూ.1,75,000 వద్ద కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: Personal Finance: కేవలం రూ.1000తో మొదలు పెట్టండి.. ఐదేళ్లలో రూ.10 లక్షలు మీ సొంతం!
గత వారం బంగారం కూడా..
ఈ గత వారంలో బంగారం కూడా పెరిగింది. ఏప్రిల్ 10న MCXలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,52,652 వద్ద ముగియగా, గత శుక్రవారం అది రూ.1,54,605కు ఎగబాకింది. ఈ విధంగా ఒక వారంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,953 మేర పెరిగింది.
వెండి లాగే జనవరిలో బంగారం ధరలు కూడా భారీగా పెరిగి, తొలిసారిగా 10 గ్రాములకు రూ.2 లక్షల మార్కును అధిగమించాయి. MCX ఎక్స్ఛేంజ్‌లో ఈ విలువైన పసుపు లోహం జీవితకాల గరిష్ఠ స్థాయి 10 గ్రాములకు రూ.2,02,984గా ఉంది. ఈ స్థాయిని ప్రస్తుత ధరతో పోల్చి చూస్తే, బంగారం రూ.48,379 వరకు పడిపోయింది.
Real Estate: గృహ కొనుగోలుదారులకు పెద్ద ఎదురుదెబ్బ.. ఒక్క ప్రభుత్వ నిర్ణయంతో రాత్రికి రాత్రే భారీగా పెరిగిన ధరలు!
Fact Check: పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి RBI కొత్త రూల్స్ తెచ్చిందా? అసలు విషయం చెప్పిన కేంద్రం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి