Headlines

Free Power: జస్ట్ నెలకు రూ.800 కడితే చాలు.. జీవితాంతం మీ ఇంటికి ఫ్రీ కరెంట్.. బ్యాంక్ నుంచి లోన్ కూడా పొందొచ్చు..

Free Power: జస్ట్ నెలకు రూ.800 కడితే చాలు.. జీవితాంతం మీ ఇంటికి ఫ్రీ కరెంట్.. బ్యాంక్ నుంచి లోన్ కూడా పొందొచ్చు..


విద్యత్ ఖర్చును తగ్గించుకునేందుకు ఇప్పట్లో చాలామంది ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని వల్ల మీరు ఒక్క రూపాయి కూడా కరెంట్ బిల్లు కట్టాల్సిన పని ఉండదు. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను మీ ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. వీటి ఏర్పాటు కోసం ప్రారంభంలో ఎక్కువ ఖర్చు అయినా కరెంట్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. కరెంట్ కొతల నుంచి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు. అంతేకాకుండా వీటి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ రుణాలు, సబ్సిడీ రూపంలో ఆర్ధిక సాయం అందిస్తోంది. తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు అందచేస్తోంది. ఎంత రుణం అందుతుంది..? సబ్సిడీ ఎంత వస్తుంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేవారికి సబ్సిడీతో పాటు ఎలాంటి హామీ లేకుండా బ్యాంక్ రుణాలు అందిస్తోంది. ఈ బ్యాంక్ రుణాలకు వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఏడాదికి కేవలం 5.75 శాతం మాత్రమే వడ్డీ ఉంటుంది. ఈ రుణాలను 10 ఏళ్లల్లో తిరిగి చెల్లించవచ్చు. ముందుగా బ్యాంక్ నుంచి రుణం పొంది సోలాల్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం వివిధ తనిఖీలు, ఆమోదాల తర్వాత ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా సబ్సిడీ సొమ్ము జమ చేస్తోంది. ఈ సొమ్మును బ్యాంక్ రుణం చెల్లించేందుకు లబ్దిదారులు ఉపయోగించుకోవచ్చు. 1 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు రూ.83,700 ఖర్చు అవుతుంది. ప్రారంభంలో రూ.8370 చెల్లించి, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ రుణం ద్వారా చెల్లించవచ్చు. ఏడాదికి 5.75 శాతం వడ్డీ ఉంటుంది. 10 ఏళ్లల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుది. దీని ప్రకారం లెక్కిస్తే ఈఎంఐ నెలకు రూ.827 అవుతుంది.

1 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెళ్లకు ప్రభుత్వం రూ.30 వేల సబ్సిడీ అందిస్తుంది. అంటే మీకు వీటి ఏర్పాటు కోసం రూ.53 వేలు అవుతుంది. ఇక 2 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలాల్ ప్యానెళ్లకు రూ.1,44,000 ఖర్చు అవుతుంది. డౌన్ పేమెంట్‌గా రూ.14,400 చెల్లించి మిగతా సొమ్ము కోసం రుణం పొందవచ్చు. ప్రభుత్వం రూ.60 వేల సబ్సిడీ అందిస్తుంది. నెలకు రూ.1422 ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. 3 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రూ.2,06,400 ఖర్చు అవుతుంది. ప్రభుత్వం రూ.78 వేలు సబ్సిడీ అందిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *