Headlines

Folk Song: ఏందిరా అయ్యా ఈ పాట.. రీల్స్, డీజేలను షేక్ చేస్తోన్న క్రేజీ ఫోక్ సాంగ్.. పెళ్లి బరాత్‌లో రచ్చ రంబోలా


తెలుగు జానపద పాటలకు ఎప్పుడూ ఉండే క్రేజే వేరు. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. డీజేలు, వేడుకలు, రీల్స్‌లో ఫోక్ సాంగ్స్ హోరు ఓ రేంజ్ లో ఉంటుంది. ఈమధ్య కాలంలో ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. ఎక్కడ చూసిన ఆ పాటలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డీజేలలో ఫోక్ సాంగ్స్ వెంటే ఆ వైబ్ వేరేలెవల్ ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంటూ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ఫోక్ సాంగ్ ఒకటి గిరుకల్ల బాయి. గత రెండు రోజుల క్రితం విడుదలైన ఈ పాట విడుదలైన కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్, వేలాది లైకులతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం ఈ పాట క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

పల్లెటూరి వాతావరణం, విశాలమైన పొలాలు, నీటి నిల్వలు, సంప్రదాయ దుస్తులు, ఆటపాటలతో గిరుకల్ల బాయి పాటను ఎంతో రంగురంగులగా తెరకెక్కించారు. ఈ పాటలో మాధురి రాథోడ్, జాక్సన్ రోహిత్ జోడీ తమ ఎనర్జిటిక్ డ్యాన్స్, సహజమైన హావభావాలతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశారు. పెద్ద సంఖ్యలో డ్యాన్సర్లతో కలిసి గ్రామీణ నేపథ్యంలో చేసిన నృత్య సన్నివేశాలు పాటకు మరింత గ్రాండ్‌నెస్ తీసుకువచ్చాయి. ఈ పాట సూపర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం దాని క్యాచీ ట్యూన్, గ్రామీణ సొగసు నిండిన లిరిక్స్. కుమార్ కోట రాసిన సాహిత్యం, వెంకట్ అయిమేర అందించిన సంగీతం పెళ్లిళ్లు, వేడుకల్లో డీజేలలో మోతమోగేలా ఉత్సాహాన్ని నింపుతున్నాయి. బొడ్డు దిలీప్ కుమార్ , మమత రమేష్ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ఆటపాటల నడుమ సాగే చిలిపి సరసాలు, గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించే సన్నివేశాలు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

శ్రీకాంత్ దర్శకత్వం, కొరియోగ్రఫీలో రూపొందిన ఈ పాటకు జనతా బబ్లు డీఓపీ, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ధర్మ రాథోడ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ పాటలోని హుక్ స్టెప్పులు, పల్లవి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ డీజేలలో ఈ పాట మోగుతుంటే వేడుక వాతావరణం మరింత జోష్‌గా మారుతోంది.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

గిరుకల్ల బాయి సాంగ్..



ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *