Headlines

EPFO PF Withdraw: ఇకపై ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా.. యూపీఐ సేవలు కూడా షురూ!

EPFO PF Withdraw: ఇకపై ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా.. యూపీఐ సేవలు కూడా షురూ!


EPFO PF Withdraw: మీకు ఇంటి ఖర్చులకు, పెళ్లి పనులకు, చికిత్సకు డబ్బు అవసరమైతే, ఇకపై మీరు ఎవరినీ సంప్రదించాల్సిన లేదా రుణం అడగాల్సిన అవసరం లేదు. సెంట్రల్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక విప్లవాత్మకమైన అప్‌డేట్‌ను అందించింది. EPFO ​​3.0 వ్యవస్థ త్వరలో కోట్లాది మంది ఉద్యోగుల సేవలోకి రాబోతోంది. పీఎఫ్‌ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే ప్రక్రియ సులభతరం అవ్వడమే కాకుండా, ఇది ఆర్థికంగా కూడా పెద్ద మార్పును తీసుకువస్తుంది. EPFO ​​3.0 అంటే ఏమిటి? దాని ప్రయోజనాలను మీరు ఎలా పొందుతారో తెలుసుకోండి?

ఇది కూడా చదవండి: School Holidays: అక్కడ జూన్‌ 30 వరకు పాఠశాలలకు సెలవులు.. జూలై 1న ఓపెన్‌..!

EPFO 3.0: ఇది పాత వ్యవస్థ నుంచి ఎంత భిన్నమైనది?

ఈజీఎఫ్‌వో మీ జీతం నుండి తీసివేసే మొత్తాన్ని ప్రణాళిక చేస్తుంది. అందువల్ల మీరు పదవీ విరమణ సమయంలో పెద్ద మొత్తాన్ని పొందుతారు. EPFO ​​3.0 ఇప్పుడు ఒక అధునాతన, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ. ఈ కొత్త వ్యవస్థ 7.8 కోట్ల మంది సభ్యులకు ఒక విప్లవాత్మక మార్పును తీసుకురానుంది.

ఇవి కూడా చదవండి

ఏమి మారింది?

  • క్లెయిమ్‌ల తక్షణ పరిష్కారం: ఇంతకుముందు ఆటో సెటిల్‌మెంట్ పరిమితి రూ. 1 లక్షగా ఉండేది. ఇప్పుడు దానిని రూ. 5 లక్షలకు పెంచనున్నారు.
  • సమయం ఆదా: ఇంతకుముందు, క్లెయిమ్‌ను పరిష్కరించి డబ్బు పొందడానికి సుమారు ఒక నెల సమయం పట్టేది. ఇప్పుడు ఈ ప్రక్రియతో డబ్బు 2 నుండి 5 రోజులలోపు ఖాతాలో జమ అవుతుంది.
  • కాగిత రహిత ప్రక్రియ: ఆధార్ ధృవీకరణతో ఇతర కాగితపు పనులతో తల పట్టుకోవాల్సిన అవసరం లేదు. పాస్‌బుక్‌ను అప్‌లోడ్ చేయాల్సిన పని లేదు.
  • కంపెనీ ఆమోదం అవసరం లేదు: ఇకపై, కేవైసీ అప్‌డేట్ లేదా పీఎఫ్ క్లెయిమ్ కోసం కంపెనీ లేదా యజమాని ఆమోదం అవసరం లేదు.

ఇప్పుడు మీకు 13కి బదులుగా కేవలం 3 కేటగిరీలలోనే డబ్బు వస్తుంది. PF విత్‌డ్రా చేసుకోవడానికి ఉన్న అడ్డంకులను తొలగించి, పాత 13 కేటగిరీలను EPFO ​​తీసివేసింది. వాటిని ఇప్పుడు 3 సులభమైన, సరళమైన కేటగిరీలుగా విభజించారు.

  • అత్యవసరం: అనారోగ్యం, ఆసుపత్రి చికిత్స, వివాహం, విద్య కోసం
  • గృహవసతి: ఇల్లు కొనడానికి లేదా గృహ రుణం తీర్చడానికి
  • ప్రత్యేక పరిస్థితులు: నిరుద్యోగం లేదా పదవీ విరమణ కోసం డబ్బు

ఇది కూడా చదవండి: Indian Railways: చేతిలో కన్ఫర్మ్ రైలు టికెట్ ఉన్నా.. రూ.2560 జరిమానా.. ప్రయాణికులు చేసే ఈ చిన్న పొరపాటే కారణం..!

ATM, UPI ద్వారా

EPFO 3.0లో, ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా చేసుకునే సౌకర్యం అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు పీఎఫ్‌ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి, ఆన్‌లైన్ దరఖాస్తును నింపి చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు EPFO ​​విత్‌డ్రాయల్ కార్డ్ ద్వారా పీఎఫ్‌ను సులభంగా, సరళంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది ఏటీఎం కార్డ్ లాగా పనిచేస్తుంది. మీ డబ్బు నేరుగా ఏటీఎం మెషిన్ నుండి బయటకు వస్తుంది. ఆ తర్వాత పీఎఫ్‌ ఖాతాను Google Pay, PhonePe లేదా ఇతర UPI ప్లాట్‌ఫారమ్‌లకు అనుసంధానించడం ద్వారా పీఎఫ్‌ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Buying: భారతీయులు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏమవుతుందో తెలుసా..?

ఇది కూడా చదవండి: Fuel Saving Tips: వార్నీ.. ఇన్నాళ్లు ఈ విషయం తెలియకపాయే.. ఆ టైమ్‌లో పెట్రోల్‌ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *