Headlines

Duleep Trophy 2026: చెన్నై వేదికగా నేటి నుంచే దులీప్ ట్రోఫీ ఫైనల్.. లైవ్ ఎక్కడ చూడాలంటే?


Duleep Trophy 2026: దేశవాళీ క్రికెట్ సమరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు నేటి నుంచి టైటిల్ పోరులో తలపడటానికి సిద్ధమయ్యాయి. స్టార్ ఆటగాళ్లతో నిండిన ఈ టైటిల్ ఫైట్‌పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ప్రధానంగా కొన్ని ఆసక్తికర పోరులు అభిమానులను ఆకట్టుకోనున్నాయి. సౌత్ జోన్ జట్టులో సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్, ఫామ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్‌ను చేర్చడం జట్టు బలాన్ని రెట్టింపు చేసింది. కొత్త బంతితో విరుచుకుపడే సిరాజ్‌ను ఈస్ట్ జోన్ 15 ఏళ్ల సంచలన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈస్ట్ జోన్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో రెండు సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన సౌత్ జోన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను షమీ ఎలా కట్టడి చేస్తాడో చూడాలి.

పగ తీర్చుకునేందుకు సౌత్ జోన్ సన్నాహాలు

గత సీజన్ ఫైనల్లో సెంట్రల్ జోన్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన సౌత్ జోన్, ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. రన్నరప్‌గా నిలిచిన అనుభవంతో సౌత్ జోన్ నేరుగా సెమీఫైనల్‌లో అడుగుపెట్టగా, ఈస్ట్ జోన్ మాత్రం క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో ఫైనల్ మెట్లు ఎక్కింది. తిలక్ వర్మ కెప్టెన్సీలో దిగుతున్న సౌత్ జోన్‌కు ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్ గట్టి పోటీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది.

లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు ఇవే

చెన్నైలోని చేపాక్ మైదానంలో ఉదయం 9:00 గంటలకు టాస్ పడనుండగా, 9:30 గంటల నుంచి ఆట ప్రారంభమవుతుంది. ఈ కీలక మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్ల ద్వారా వీక్షించవచ్చు. ఇక డిజిటల్ మొబైల్, ఆన్‌లైన్ యూజర్ల కోసం జియోహాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనుంది.

జట్ల వివరాలు:

సౌత్ జోన్ స్క్వాడ్:

తిలక్ వర్మ (కెప్టెన్), మహమ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్, శ్రేయస్ గోపాల్, కరుణ్ నాయర్, రికీ భుయ్ (వికెట్ కీపర్), ఎండీ నిధీష్, నారాయణ్ జగదీసన్ (వికెట్ కీపర్), అమన్ హాకిమ్ ఖాన్, విధ్వత్ కావేరప్ప, స్మరణ్ రవిచంద్రన్, షేక్ రషీద్, త్రిపురాణ విజయ్, కె. హిమతేజ, అభినవ్ తేజరాణా, కవురి సాయి తేజ, తనయ్ త్యాగరాజన్.

ఈస్ట్ జోన్ స్క్వాడ్:

ఇషాన్ కిషన్ (కెప్టెన్/వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), మహమ్మద్ షమీ, షాబాజ్ అహ్మద్, అభిజీత్ సర్కార్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ సింగ్, ముకేష్ కుమార్, సుభ్రాంషు సేనాపతి, అనుకూల్ రాయ్, సుదీప్ కుమార్ ఘరామి, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), శిఖర్ మోహన్, సూరజ్ జైస్వాల్, డెనిష్ దాస్, కునైన్ ఖురేషి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *