Headlines

DMart: డీమార్ట్ ఓనర్ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా? మతిపోగొట్టే నిజం

DMart: డీమార్ట్ ఓనర్ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా? మతిపోగొట్టే నిజం


భారత్‌లో తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చే పేరు డిమార్ట్ (DMart). చిన్న పట్టణాల నుంచి మహానగరాల వరకు వేగంగా విస్తరించిన ఈ రిటైల్ చైన్, నేడు కేవలం షాపింగ్ కేంద్రంగానే కాకుండా ఒక ప్రాంత అభివృద్ధికి సూచికగా కూడా మారింది. ఒక ప్రాంతంలో డిమార్ట్ స్టోర్ ప్రారంభం కానుందనే వార్త వచ్చినా అక్కడ భూముల ధరలు పెరుగుతాయని ప్రజలు భావించే స్థాయికి ఈ బ్రాండ్ ఎదిగింది. ఈ విజయానికి ప్రధాన కారణం డిమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ. భారత స్టాక్ మార్కెట్‌లో దిగ్గజ పెట్టుబడిదారుడిగా గుర్తింపు పొందిన ఆయనను దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తన గురువుగా పేర్కొనేవారు. కేవలం 12వ తరగతి వరకు మాత్రమే చదివిన దమానీ, తన వ్యాపార దూరదృష్టితో లక్షల కోట్ల రూపాయల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు.

ఇది కూడా చదవండి: DMart: రూ.1000 లతో డీమార్ట్‌కు వెళ్తే.. నెలకు సరిపడా సరుకులు! చాలా మందికి తెలియని సింపుల్ ట్రిక్స్

అయితే ఈ విజయం ఒక్కసారిగా రాలేదు. 1999లో నెరూల్‌లో ప్రారంభించిన తొలి ఫ్రాంచైజీ వ్యాపారం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అనంతరం బోర్‌వెల్ వ్యాపారంలోకి అడుగుపెట్టినా అక్కడ కూడా విజయాన్ని అందుకోలేకపోయారు. ఈ వైఫల్యాల తర్వాత 2002లో ముంబైలో తొలి డిమార్ట్ స్టోర్‌ను ప్రారంభించారు. అప్పుడే ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె భవనాల్లో కాకుండా, సొంత స్థలాల్లోనే స్టోర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిమార్ట్‌కు 300కు పైగా స్టోర్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం కంపెనీ సొంత భూములపైనే నిర్మించబడ్డాయి. దీంతో ప్రతి నెల భారీ అద్దె చెల్లించాల్సిన అవసరం లేకుండా ఖర్చులు గణనీయంగా తగ్గాయి.

ఇది కూడా చదవండి: DMart: నెలలో ఏ రోజు డీమార్ట్‌కి వెళ్తే మంచిది..? చాలా మందికి తెలియని ట్రిక్

ఈ ఆదాను వినియోగదారులకు తక్కువ ధరల రూపంలో అందించడం డిమార్ట్ వ్యాపార నమూనాలో కీలక అంశంగా మారింది. డిమార్ట్ విజయానికి మరో ప్రధాన కారణం వేగవంతమైన స్టాక్ నిర్వహణ. కంపెనీ సాధ్యమైనంత వరకు 30 రోజుల్లోనే స్టాక్‌ను విక్రయించి, కొత్త సరుకును తెప్పించే విధానాన్ని అనుసరిస్తుంది. అలాగే సరఫరాదారులకు చెల్లింపులను త్వరగా పూర్తి చేయడం వల్ల తయారీ సంస్థలు కూడా డిమార్ట్‌కు మెరుగైన డిస్కౌంట్లతో సరుకును అందిస్తాయి. ఈ తగ్గింపులను వినియోగదారులకు డిస్కౌంట్ల రూపంలో అందించడం ద్వారా డిమార్ట్ తక్కువ ధరలను కొనసాగిస్తోంది. సొంత భూములు, తక్కువ నిర్వహణ ఖర్చులు, వేగవంతమైన స్టాక్ టర్నోవర్, సరఫరాదారులతో బలమైన సంబంధాలు వంటి వ్యూహాలే డిమార్ట్‌ను భారతదేశంలో అత్యంత విజయవంతమైన రిటైల్ చైన్‌లలో ఒకటిగా నిలబెట్టాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *