CSK vs KKR Playing XI: టాస్ గెలిచిన కేకేఆర్.. తొలి విజయం దక్కేనా.. ప్లేయింగ్ 11 ఇదే..?

CSK vs KKR Playing XI: టాస్ గెలిచిన కేకేఆర్.. తొలి విజయం దక్కేనా.. ప్లేయింగ్ 11 ఇదే..?


IPL చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్ కతా నైట్ రైడర్స్ Playing XI: ఐపీఎల్ సీజన్‌లోని 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుతో నేడు తలపడుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్ చేయనుంది. వరుణ్ చక్రవర్తి ఫిట్‌గా ఉన్నాడని, నవదీప్ సైని స్థానంలో అతను తిరిగి జట్టులోకి వస్తున్నాడని కెప్టెన్ అజింక్య రహానే ప్రకటించాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే సీఎస్కే తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. సీఎస్‌కే, కేకేఆర్ జట్లు చెరో ఐదో మ్యాచ్ ఆడనున్నాయి. సీఎస్‌కే ఇప్పటివరకు ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. కేకేఆర్ ఇంకా తన తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. ఆ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో ఓడిపోగా, పంజాబ్‌తో జరగాల్సిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్‌లో కూడా ఆడటం లేదు. అతను గత మ్యాచ్‌కు స్టేడియానికి హాజరు కాలేదు.

ఇవి కూడా చదవండి

ఇరుజట్లు..

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *