Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకుంటే.. జైలు శిక్ష తప్పదా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకుంటే.. జైలు శిక్ష తప్పదా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?


నేటి వేగవంతమైన జీవితంలో క్రెడిట్ కార్డ్ వినియోగం విపరీతంగా పెరిగింది. షాపింగ్ ప్రయాణం లేదా అత్యవసర ఖర్చుల కోసం చాలామంది ఇప్పుడే ఖర్చు, తర్వాత చెల్లింపు విధానాన్ని సులభంగా ఉపయోగిస్తున్నారు. అయితే నెలాఖరులో బిల్లు పెద్ద మొత్తంగా కనిపించినప్పుడు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక సందేహం తరచుగా వినిపిస్తోంది. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే జైలుకి వెళ్ళాల్సి వస్తుందా? మరి ఈ విషయంపై ఆర్థిక, న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

నిపుణుల ప్రకారం.. సాధారణంగా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోవడం క్రిమినల్ నేరం కాదు. ఇది సివిల్ ఆర్థిక వ్యవహారంగా పరిగణించబడుతుంది. అంటే బిల్లు ఆలస్యమైనందుకు నేరుగా పోలీసులు అరెస్ట్ చేయరు. ముందుగా బ్యాంకులు లేదా కార్డ్ సంస్థలు SMSలు, కాల్స్, ఇమెయిల్స్ ద్వారా రిమైండర్లు పంపుతాయి. చాలా కాలం బకాయి ఉంటే కేసు కోర్టుకు వెళ్లవచ్చు. కోర్టు బకాయి మొత్తం చెల్లించాలని ఆదేశించవచ్చు కానీ సాధారణ డిఫాల్ట్‌కు జైలు శిక్ష ఉండదు. అయితే కొన్ని పరిస్థితుల్లో విషయం తీవ్రమవుతుంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు పత్రాలు ఇవ్వడం, ఆదాయం గురించి అబద్ధాలు చెప్పడం, లేదా బ్యాంకును మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే అది క్రిమినల్ కేసుగా మారే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో చట్టపరమైన చర్యలు కఠినంగా ఉండవచ్చు.

బిల్లు చెల్లించకపోతే ఎదురయ్యే ప్రధాన నష్టాలు

  • క్రెడిట్ స్కోర్ పడిపోవడం.. ఒకటి లేదా రెండు నెలలు ఆలస్యం అయినా మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. దీంతో భవిష్యత్తులో హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ పొందడం కష్టమవుతుంది.
  • భారీ వడ్డీ.. డ్యూ తేదీ మిస్ అయితే బ్యాంకులు అధిక వడ్డీ విధిస్తాయి. చక్రవడ్డీ కారణంగా బకాయి త్వరగా పెరుగుతుంది.
  • లేట్ ఫీజులు, జరిమానాలు.. బిల్లుపై ఆధారపడి రూ.400 నుంచి రూ.950 లేదా అంతకంటే ఎక్కువ జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. ప్రతి బ్యాంక్ నియమాలు వేర్వేరుగా ఉంటాయి.
  • రికవరీ కాల్స్, నోటీసులు.. బకాయి ఎక్కువ కాలం కొనసాగితే రికవరీ టీమ్స్ సంప్రదించవచ్చు, లీగల్ నోటీసులు రావచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *