Cold Water Vs Warm Water: వేసవిలో వేడి నీళ్లు తాగితే ఏమవుతుంది? ఇదేం ప్రశ్న అనుకుంటే తప్పులో కాలేసినట్లే..

Cold Water Vs Warm Water: వేసవిలో వేడి నీళ్లు తాగితే ఏమవుతుంది? ఇదేం ప్రశ్న అనుకుంటే తప్పులో కాలేసినట్లే..


Cold Water Vs Warm Water: వేసవిలో వేడి నీళ్లు తాగితే ఏమవుతుంది? ఇదేం ప్రశ్న అనుకుంటే తప్పులో కాలేసినట్లే..

వేసవి తాపంలో తరచుగా దాహం వేయడం సహజం. ఉష్ణోగ్రత పెరుగుతున్న ఈ సమయంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ వేసవిలో వేడి నీళ్లు తాగడానికి ఎవరూ ఇష్టపడరు. చాలా మంది చల్లటి నీళ్లు తాగడానికే ఇష్టపడతారు. వేడి నీళ్లు లేదా సాధారణ ఉష్ణోగ్రతలో ఉండే గోరువెచ్చని నీళ్లు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ వేసవిలో మాత్రం వేడి నీళ్లు తాగాలనిపించదు. అందుకే వారు ఫ్రిజ్ లోని ఐస్ వాటర్, చల్లటి నీళ్లు.. ఇలా వారికి క్షణికమైన ఆనందాన్ని ఇచ్చే ఏదైనా తాగుతారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ సమయంలో ఏ రకమైన నీళ్లు ఆరోగ్యానికి మంచిదో? వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

వేసవిలో చల్లటి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రభావాలు

వేసవిలో చల్లటి నీళ్లు తక్షణ చల్లదనాన్ని అందించినప్పటికీ.. వీటిని అధిక పరిమాణంలో తాగడం జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. చల్లటి నీరు శరీర అంతర్గత ఉష్ణోగ్రతను తక్షణమే తగ్గించడం ద్వారా జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. ముఖ్యంగా భోజనం తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల అజీర్ణం కలిగిస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా నిరోధిస్తుంది.

వేడినీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

సాధారణంగా వేడి లేదా కొద్దిగా గోరువెచ్చని నీళ్లు శరీర జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. వేసవిలో కూడా ఉదయం పూట గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీర జీవక్రియను పెంచడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీళ్లు ఉత్తమ ఎంపిక

నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవిలో చల్లటి లేదా చాలా వేడి నీటి కంటే గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది. ఇది శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపదు. ముఖ్యంగా బయటకు వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం మానుకోవాలి.

మీరు రోజుకు ఎంత నీళ్లు తాగాలి?

డీహైడ్రేషన్‌ను నివారించడానికి రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీళ్లు తాగడం ఉత్తమం. ఎక్కువగా చెమట పట్టే వారు ఇంకా ఎక్కువ నీరు తాగాలి. దీనికి అదనంగా మీరు పండ్ల రసం, కొబ్బరి నీరు మొదలైనవి కూడా తీసుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *