CM Chandrababu : ఏపీలో పెట్రోల్‌ షార్టెజ్.. సీన్‌లోకి సీఎం ఎంట్రీ.. ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు

CM Chandrababu : ఏపీలో పెట్రోల్‌ షార్టెజ్.. సీన్‌లోకి సీఎం ఎంట్రీ.. ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు


రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత నేపథ్యంలో ఆయిల్‌ కంపెనీలకు సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఆయిల్ కంపెనీలు ఎందుకు క్రెడిట్ ఇవ్వడం లేదని.. HPCL, IOCL, BPCL ప్రతినిధులను ప్రశ్నించారు. రిటైల్ ఔట్‌లెట్‌లకు అప్పుఇవ్వడం లేదని ప్రతినిధులు చెప్తుండటంతో ఆయిల్‌ కంపెనీల తీరుపై ఆయన సీరియస్‌ అయ్యారు. అయిల్ కంపెనీ యాజమాన్యాలు ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే.. అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి వస్తుందన్నారని హెచ్చరించారు. ఏం జరుగుతుందో తనకు నివేదికలు వద్దని.. ఫలితాలు కావాలని ఆయిల్‌ కంపెనీలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో నెలకొన్న ఫ్యూయల్‌ కొరతపై ఏపీ పెట్రోల్‌ బంక్స్‌ అసోసియేషన్‌ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ వ్యాప్తంగా ఫ్యూయల్‌ సంక్షోభం వాస్తవమే అన్నారు. అయితే.. పెట్రోల్‌ కంటే డీజిల్‌ కొరత ఎక్కువగా ఉందని చెప్పారు. గత వారంలో ఆయిల్‌ కంపెనీలు తక్కువ సప్లయ్‌ చేయడంతోనే కొరత ఏర్పడిందన్నారు. ఆయిల్ కంపెనీల డీలర్ల సమీక్షలో కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చిందని గోపాలకృష్ణ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత సమస్య క్లియర్‌ అవుతుందని భావిస్తున్నామన్నారు.అ దేసమయంలో.. కస్టమర్లు కంగారు పడి అవసరానికి మించి డీజిల్‌, పెట్రోల్‌ ఫిల్‌ చేయించుకోవద్దని గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *