ఆచార్య చాణక్యుని నీతి 1: భార్యాభర్తల మాట్లాడుకుంటునప్పుడు మూడో వ్యక్తి వస్తే మీ మాటలను ఆపేయండి. మూడో వ్యక్తి వలన గొడవలు, అపార్థాలు మొదలవుతాయి. అలాగే, బంధం బలహీనపడటానికి కూడా ఒక కారణమవుతుంది. కాబట్టి వారు మాట్లాడుకుంటున్న సమయంలో జోక్యం చేసుకోకూడదు. ఇది గొడవను మరింత పెంచుతుంది.
ఆచార్య చాణక్యుని నీతి 2 : ఇంకా గురువులు, పండితుల మాట్లాడుకుంటున్న సమయంలో ఇతరులు వెళ్ళకూడదు. పొరపాటున ఎవరైనా వస్తే మీ మాటలను కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చర్చలు కూడా జరపకూడదు. లేదంటే, మీరు మాట్లాడుకున్న మాటలు ఊరు మొత్తం చేరతాయి. వారిని ప్రశ్నలు అడిగి పంపించేయాలి.
ఆచార్య చాణక్యుని నీతి 3: యజమాని ఉద్యోగి మాట్లాడే సమయంలో మధ్యలో అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే, ఇవి అధికారికమైనవిగా ఉంటాయి. కాబట్టి, మధ్యలో మాట్లాడటం మంచిది కాదు, అది పద్ధతి కూడా కాదు. అవసరమైతే తప్ప లేదంటే అక్కడి నుంచి ఇతరులు దూరంగా వెళ్లిపోవడమే మంచిది. అనుమతి తీసుకుని మాట్లాడండి
ప్రతి పరిస్థితికి ఒక హద్దు ఉంటుంది అది మనుషులు తప్పక అర్ధం చేసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరూ దీనిని తప్పక తెలుసుకోవాలని చాణక్యుడు చెప్పారు. సందర్భం లేకుండా మాటలు జారవద్దు. అలాగే, అది అగౌరవంగా కూడా ఉండదు. దీని వలన వివాదాలు పెరగడం తప్ప ఏం ఉండవు. అప్పుడప్పుడు మౌనం పాటించడం కూడా మంచిది.
సంబంధం లేకుండా కొందరు మధ్యలో మాట్లాడుతుంటారు. ఎదుటి వాళ్ళ అనుమతి లేకుండా మధ్యలో మాట్లాడకూడదని
ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు.(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)




