BOB-Jio: జియో ఫోన్ వినియోగదారులకు పండగే.. బ్యాంక్ ఆఫ్ బరోడా యాప్‌తో డిజిటల్ బ్యాంకింగ్ షురూ!

BOB-Jio: జియో ఫోన్ వినియోగదారులకు పండగే.. బ్యాంక్ ఆఫ్ బరోడా యాప్‌తో డిజిటల్ బ్యాంకింగ్ షురూ!


BOB-Jio: జియో ఫోన్ వినియోగదారులకు పండగే.. బ్యాంక్ ఆఫ్ బరోడా యాప్‌తో డిజిటల్ బ్యాంకింగ్ షురూ!

BOB and Reliance Jio: స్మార్ట్‌ఫోన్ లేని సామాన్యులకు కూడా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, రిలయన్స్ జియో చేతులు కలిపాయి. ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ లైట్’ (bob World Lite) ను సోమవారం ‘జియోఫోన్ ప్రైమా 4జీ’ పరికరాల్లో ప్రారంభించాయి.

ఈ యాప్ ప్రత్యేకతలు:

అందరికీ అందుబాటులో: ఇది కేవలం బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకే కాకుండా, ఇతర బ్యాంకుల వినియోగదారులకు కూడా సులభమైన రిజిస్ట్రేషన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరలో లభించే కీప్యాడ్ ఫోన్లలో తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్నా ఈ యాప్ వేగంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఎన్నో ముఖ్యమైన సేవలు ఉన్నాయి. యూపీఐ (UPI) ద్వారా డబ్బు పంపడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయడం, మొబైల్ రీచార్జ్‌లు, బిల్లు చెల్లింపులు వంటి సేవలను దీని ద్వారా పొందవచ్చు. జియోఫోన్ ప్రైమా 4జీ ఫోన్లలో ఇది ముందే ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. ఇతర వినియోగదారులు జియోస్టోర్ నుండి దీన్ని పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Electric Scooters: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? మెరుపు వేగంతో ఛార్జింగ్ అయ్యే టాప్ 5 స్కూటర్లు ఇవే!

ఎందుకు ఇది ముఖ్యం?:

గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నివసించే కోట్లాది మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగకరం. డిజిటల్ అంతరాన్ని తగ్గిస్తూ, ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, సులభమైన బ్యాంకింగ్ సేవలను అందించడమే ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశ్యం. స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే పనిచేసే సాధారణ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లకు భిన్నంగా, బాబ్ వరల్డ్ లైట్ యాప్‌ను తక్కువ ధరలో లభించే ఫీచర్ ఫోన్లలో రోజువారీ బ్యాంకింగ్ సేవలను సమగ్రంగా అందించే విధంగా అభివృద్ధి చేశారు.

Jio Bob

ఇది కూడా చదవండి: Akshaya Tritiya 2026: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఈ నగల వ్యాపారుల భారీ డిస్కౌంట్లు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *