Balakrishna: బాలకృష్ణకు ఆ ఒక్క విషయంలోనే ఎక్కువ కోపం వస్తుంది.. అసలు విషయం చెప్పిన దర్శకుడు

Balakrishna: బాలకృష్ణకు ఆ ఒక్క విషయంలోనే ఎక్కువ కోపం వస్తుంది.. అసలు విషయం చెప్పిన దర్శకుడు


ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు బి గోపాల్ తెలుగు ప్రేక్షకులకు మాస్ సినిమాల సత్తా ఏంటో చూపించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందించారు దర్శకుడు బి గోపాల్. నందమూరి బాలకృష్ణతో తన సుదీర్ఘ అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాలకృష్ణ పాత్ర పట్ల కనబరిచే అంకితభావం, ఆయన వృత్తి నైపుణ్యం అద్భుతమని గోపాల్ కొనియాడారు. రౌడీ ఇన్‌స్పెక్టర్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఎంతగా ఓన్ చేసుకున్నారో వివరించారు. “నేను ఏ జీపులో వస్తానో, అదే జీపును పోలీస్ స్టేషన్‌కు పంపాలి, లేదంటే నేను రాను” అని బాలకృష్ణ షాట్‌కు ముందు అడిగారని గోపాల్ తెలిపారు. కేవలం జీపులో కూర్చోవడం, కాలు బయట పెట్టి, లాఠీ పట్టుకుని సి.ఐ. లాగా లొకేషన్‌కు రావడం, బాలకృష్ణ ఆ పాత్రలో లీనమైన తీరు దర్శకుడిని ఎంతగానో ఆకట్టుకుందని ఆయన అన్నారు. రౌడీ ఇన్‌స్పెక్టర్లో బాలకృష్ణ మీసం, కూలింగ్ గ్లాసెస్‌తో కనబరిచిన పవర్ అసాధారణమని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా

ముఖ్యంగా, పోలీస్ స్టేషన్ సన్నివేశంలో బాలకృష్ణ కుర్చీని తన్ని, “ఈ డ్రెస్ వేసినంతవరకేరా నేను పోలీస్ ఆఫీసర్‌ని, ఈ డ్రెస్ తీస్తే నీకంటే పెద్ద రౌడీని రా నేను” అని చెప్పే డైలాగ్, ఆయన హావభావాలు అచ్చం ఎన్.టి. రామారావును గుర్తు చేశాయని గోపాల్ అన్నారు. కొండవీటి సింహంలో రామారావు గారిని చూసిన అనుభూతి కలిగిందని బాలకృష్ణకు తాను చెప్పినట్లు తెలిపారు. బాలకృష్ణకు కోపం ఎక్కువ అనే ప్రచారాన్ని గోపాల్ ఖండించారు. “నేను ఐదు సినిమాలు చేశాను. ఆయన సరదాగా, అందరితో బాగా ఉంటారు. ఏడు గంటలకు షాట్ రెడీ అని చెప్పినప్పుడు, ఏడున్నర, ఎనిమిది అయినా సిన్సియర్‌గా పనిచేయకుండా డిలే చేస్తేనే ఆయనకు కోపం వస్తుంది” అని వివరించారు. తమ సెట్‌లో బాలకృష్ణ ఏడు గంటలకు షాట్ అంటే 6:55కే సిద్ధంగా ఉండేవారని, తాము కూడా అంత జాగ్రత్తగా ఉండేవారమని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!

లారీ డ్రైవర్ సినిమా సమయంలో వచ్చిన ఒక చిన్న అభిప్రాయభేదాన్ని కూడా గోపాల్ వివరించారు. ఒక రచయిత వర్షన్ రాస్తే, మరొకరు కొన్ని సీన్లు మార్చారని, అయితే అది సినిమాకు తప్పు అవుతుందని భావించి రీషూట్లు చేయాల్సి వచ్చిందని తెలిపారు. రీషూట్ల సమయంలో బాలకృష్ణకు సరిగా వివరించలేకపోవడం వల్ల ఆయన కొంతకాలం అలిగారని, కోప్పడకపోయినా మాట్లాడలేదని చెప్పారు. తర్వాత సమస్యను బాలకృష్ణకు వివరించగా, ఆయన అర్థం చేసుకున్నారని గోపాల్ గుర్తు చేసుకున్నారు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు చిత్రాల గురించి ప్రస్తావించారు. సమరసింహా రెడ్డి ఇండస్ట్రీ రికార్డు హిట్‌గా నిలవగా, నరసింహా నాయుడు కూడా సూపర్ హిట్ అయ్యిందని పేర్కొన్నారు. ఈ రెండు చిత్రాలు తెలుగు సినీ చరిత్రలో బాలకృష్ణ ఇమేజ్‌ను మరింత పటిష్టం చేశాయని తెలిపారు. అయితే, పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రం నిరాశపరచడానికి గల కారణంపై స్పందిస్తూ, “ఏ సినిమా అయినా సరే ఆడియన్స్ నచ్చాలి. నచ్చితే హిట్ అవుద్ది, నచ్చకపోతే ఫ్లాప్ అవుద్ది” అని అన్నారు, ప్రేక్షకుల అభిప్రాయమే ఫైనల్ అని బి గోపాల్ అన్నారు.

ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *