Headlines

Avengers Endgame Encore: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్ దెబ్బకు.. మన బాహుబలి రికార్డ్‌ గల్లంతు!


అవెంజర్స్.. ఈ పేరు వింటే చాలు సూపర్ హీరో లవర్స్‌ అందరూ ఒక్క సారిగా ఎగ్జైట్ అవుతుంటారు. ఈ సినిమాల గురించి మాట్లాడడం షురూ చేస్తుంటారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సిరీస్‌లో.. అవెంజర్స్ ఎండ్ గేమ్ చివరి సినిమా. అయితే ఈ సినిమాకే కొన్ని అదనపు సీన్లను చేర్చి అవేంజర్ ఎండ్ గేమ్ ఎన్‌కోర్ పేరుతో థియేటర్లో ఈ సినిమాను రీ-రిలీజ్ చేసింది మార్వెల్ స్టూడియోస్‌. ఈ ఎన్‌కోర్ వర్షన్‌లో మేకర్స్ జోడించిన నాలుగు నిమిషాల ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్ ఫ్యాన్స్‌ను థియేటర్లకు పరుగులు తీయించింది. డే1 బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక స్యాక్‌నిల్క్ నివేదిక ప్రకారం.. ఈ సినిమా శుక్రవారం ఒక్క రోజే ఇండియాలో ఏకంగా 7.25 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రాబట్టింది. మన దేశంలో కేవలం 3600 స్క్రీన్స్‌లో మాత్రమే విడుదలైనప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇప్పుడు అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఇప్పటివరకు మన దేశంలో రీ-రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన రికార్డు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి ది ఎపిక్’సినిమాదే. ఈ సినిమా దాదాపు 5 కోట్లు ఓపెనింగ్ రాబట్టి అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడీ రికార్డును ‘ఎండ్‌గేమ్ ఎన్‌కోర్’ దాటేసింది. నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ రేంజ్ రెస్పాన్స్ చూస్తుంటే, మార్వెల్ రాబోయే చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ MCU లోకెల్లా అత్యంత ప్రమాదకరమైన విలన్ డాక్టర్ డూమ్ రాకను హింట్ ఇస్తూ… వచ్చిన ఎన్ కోర్ వెర్షన్… రాబోయే డూమ్స్‌డేకి గట్టి పునాది వేసిందనే చెప్పాలి. థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం, చిన్న పెద్దా.. తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఎగబడి చూడటంతో MCUకి మళ్ళీ మంచి రోజులు వచ్చేశాయని అనిపిస్తోంది. డిసెంబర్‌లో ‘డూమ్స్‌డే’ రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత ఉంటుందో ఇప్పటి నుంచే ఊహించుకోవచ్చు. ఇక, ఈ ‘ఎండ్‌గేమ్ ఎన్‌కోర్’ ను డైరెక్ట్ చేసిన జో-యాంతోనీ, రూసో జోడీనే… రాబోయే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఇన్నాళ్ళు ఐరన్ మ్యాన్‌గా మెప్పించిన రాబర్ట్ డౌనీ జూనియర్, ఇప్పుడు విలన్‌గా డాక్టర్ డూమ్ అవతారంలోకి మారడం అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని పెంచేసింది. అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎన్‌కోర్ మీjg ఇప్పటికే చూసినట్టు అయితే.. మీకు ఆ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక టోల్ కోసం ఆగాల్సిన పనే లేదు!

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న కరెంట్‌ బిల్లు ఛార్జీలు

పాలకూట విషం.. సూదిమందులతో ప్రజలు, పశువుల ప్రాణాలతో చెలగాటం!

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి కేంద్రం కొత్త నిబంధనలు

The Paradise: ది ప్యారడైజ్’లో కయాదు పాత్రపై విమర్శలు..పెద్దిని చూసి కూడా ఓదెల ఇలా చేశారా?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *