AP Anganwadi Jobs 2026: టెన్త్‌ పాసైన మహిళలకు భలే ఛాన్స్.. 108 అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు

AP Anganwadi Jobs 2026: టెన్త్‌ పాసైన మహిళలకు భలే ఛాన్స్.. 108 అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు


ఆంధ్రప్రదేశ్‌ ఐసీడీఎస్‌ (ICDS) ప్రాజెక్టు కింద నంద్యాల జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ ఆయాలు (సహాయకులు) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా కలెక్టర్ అండ్‌ జిల్లా ఎంపిక కమిటీ ఛైర్మన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 108 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన వివాహిత మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలు పోస్టులు 7, అంగన్‌వాడీ ఆయాలు (హెల్పర్) పోస్టులు 101 వరకు ఉన్నాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత గ్రామంలో స్థానిక నివాసి అయిన వివాహితురాలైన మహిళ అయి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2025 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధుల్లో 21 ఏళ్ల అభ్యర్థులు స్థానికంగా లేకపోతే 18 ఏళ్లు నిండి వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హతలు కలిగిన వారు ఏప్రిల్ 23, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో ఈ కింది అడ్రస్‌లో దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలపై స్వయంగా సంతకం చేయాల్సి ఉంటుంది. నింపిన దరఖాస్తులను సంబంధిత CDPO కార్యాలయంలో ముగింపు గడువులోగా సమర్పించాలి. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోండి.

జతపరచవల్సిన సర్టిఫికెట్లు ఇవే..

  • పుట్టిన తేదీ లేదా వయసు దృవీకరణ సర్టిఫికెట్‌
  • కుల సర్టిఫికెట్‌
  • పదో తరగతి సర్టిఫికెట్‌
  • నివాస స్థల దృవీకరణ సర్టిఫికెట్‌
  • వితంతువు అయితే భర్త మరణ దృవీకరణ సర్టిఫికెట్‌, 18 సంవత్సరాల పిల్లలు ఉంటే వారి వయసు దృవీకరణ సర్టిఫికెట్‌
  • వికలాంగులు అయితే సదరన్‌ వారు జారీ చేసిన సర్టిఫికెట్‌
  • ఆధార్ కార్డు
  • రేషన్‌ కార్డు

నంద్యాల జిల్లా అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *