రణ్‌బీర్ సంగతి మాట్లాడుకుంటుంటే, un intentionally మనసు సందీప్ రెడ్డి వంగా మీదకు మళ్లుతోందా? యస్.. మరి ప్రాజెక్టులన్నీ ఇంటర్‌లింక్డ్ అయినప్పుడు ఆ మాత్రం కన్సర్న్ కామనే కదా అని అంటారా? ఈ విషయం కూడా జోరుగానే డిస్కషన్స్ లో ఉంది… సందీప్ ప్లాన్ బీని సిద్ధం చేసుకుంటున్నారా మరి. యానిమల్ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు? యానిమల్ పార్కులో రణ్‌బీర్‌ని ఎప్పుడు చూస్తాం.. ఈ సారి హీరోగానే కాదు, విలన్‌గానూ రణ్‌బీర్ కనిపిస్తారు. గీతాంజలి రోల్‌లో రష్మిక రోల్ మరో రేంజ్‌లో ఉంటుంది. ఛోటా బాబీ పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి… ఇలా ఎన్నో విషయాలు మనసులో ఫ్లాష్ అవుతున్నాయి ఫస్ట్ పార్టు చూసిన వారికి. యానిమల్‌కి సంబంధించిన ఇన్ని ప్రశ్నలకూ సమాధానం రావాలంటే యానిమల్ పార్క్ రిలీజ్ కావాలి. అదే జరగాలంటే ముందు స్టార్ట్ కావాలి. 2027లో స్టార్ట్ చేస్తారనే టాక్ ఆల్రెడీ ఉంది. యానిమల్ పార్క్ స్టార్ట్ కావడానికన్నా ముందు స్పిరిట్ పనులు కంప్లీట్ చేయాలి సందీప్. ఒన్స్ స్పిరిట్ పనులన్నీ పూర్తయ్యాక వాట్ నెక్స్ట్ అనే విషయం మీద ఫోకస్ పెడుతారు సందీప్. అప్పటికి రణ్‌బీర్ అవైలబిలిటీని బట్టి సందీప్ ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సందీప్ అచ్చంగా దీన్నే ఫాలో అవుతారా? లేకుంటే ప్లాన్ బీలు సిద్ధం చేసుకుంటున్నారా? మరే హీరోనైనా మైండ్‌లో పెట్టుకుని బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TSRTC: మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె.. చర్చలు షురూ.. ఆ మూడు డిమాండ్లే కీలకం
Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. తగ్గిన బంగారం ధరలు
తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
ఆధార్ నెంబర్ ఉంటే.. డబ్బులు డ్రా చేయచ్చా ??