బైక్, టీవీఎస్ లాంటి ద్విచక్రవాహనలపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి.. ఇంకా.. వాహనం నడిపే వారు హెల్మెట్ కూడా ధరించాలి.. అయితే.. ఓ వాహనదారుడు.. నిబంధనలు గాలికి వదిలేసి.. టీవీఎస్ ఎక్సెల్ పై ఆరుగురిని ఎక్కించుకుని రయ్ రయ్ అంటూ గాల్లోకి తేలిపోతున్నాడు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో.. వాహనదారుడు ఏకంగా ఐదుగురిని టీవీఎస్ ఎక్సెల్ పై ఎక్కించుకొని.. తాను బండి తోలుతూ కనిపించాడు.. ఇలా ఆరుగురు ప్రమాదకరంగా వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.. టీవీఎస్ ఎక్సెల్ సీటు మీద ఓ పొడవాడి కర్రను తాడుతో కట్టి.. దానిపై నలుగురు పిల్లల్ని.. ముందు తన భార్యను కూర్చోబెట్టుకుని వెళుతూ కనిపించాడు. ప్రమాదకరంగా చేస్తున్న వారి ఈ ప్రయాణం.. రోడ్డుపై వెళుతున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా.. భద్రత ఆలోచనలను కూడా రేకెత్తించింది.
చాలా మంది ఆ వాహనదారుడి ప్రయాణం దృశ్యాలను తమ సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు.. ఏ మాత్రం పట్టు తప్పినా.. ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ… పట్టించుకోకుండా… అతను వాహనం నడుపుతూ కనిపించాడు.. ప్రస్తుతం ఈ ప్రయాణం వీడియో తెగ వైరల్ అవుతోంది.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..