పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసం ‘కార్తీక మాసం’ ప్రారంభమైంది. దీంతో చాలా మంది భక్తులు శివయ్య దీక్షను స్వీకరిస్తున్నారు. తెల్లవారుజామునే నదీ స్నానాలు, శివాలయాలలో రుద్రాభిషేకాలు, తులసి పూజ, ఆవు నెయ్యితో దీపారాధన, కార్తీక పురాణ పఠనం చేస్తూ నియమ నిష్టలతో ఉంటున్నారు.