Headlines

Amitabh Bachchan : సౌత్ ఇండస్ట్రీలో అతడు అద్భుతమైన నటుడు.. నేను ఆ హీరోకు పెద్ద ఫ్యాన్.. అమితాబ్ బచ్చన్..


బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఓ హీరో ప్రతిభను చూసి ముగ్దుడయ్యారు. అతడి నటన అంటే తనకు చాలా ఇష్టమని.. అతడే తన ఫేవరెట్ అని వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ‘కౌన్ బనేగా కరో పతి’ 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలోని ఒక కంటెస్టెంట్ తాను నటుడు ధనుష్‌కు పెద్ద అభిమానినని పేర్కొన్నాడు. దీనిపై స్పందిస్తూ, అమితాబ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నేను కూడా ధనుష్‌కు పెద్ద అభిమానిని. ధనుష్ నిజంగా ఒక అసాధారణ కళాకారుడు. తనకు ఇచ్చిన ఏ పాత్రలోనైనా పూర్తిగా లీనమయ్యే అద్భుతమైన సామర్థ్యం అతనికి ఉందని అమితాబ్ అతనిపై తన ప్రశంసలను వ్యక్తం చేశారు. ధనుష్ నటన గురించి బిగ్ బి అంతగా ప్రశంసించడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ధనుష్ ఉత్తమ నటుడు మాత్రమే కాదు, బెస్ట్ డ్యాన్సర్ అని అమితాబ్ అన్నారు. 2015లో విడుదలైన ‘షమితాబ్’ చిత్రంలో ధనుష్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించడం తనకు దక్కిన గొప్ప అదృష్టమని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

నేను ఇంతకుముందు ధనుష్ గురించి చాలా విన్నాను. కానీ అతన్ని నేరుగా కలవడం, అతనితో కలిసి పనిచేయడం, అతని నటనను దగ్గరగా గమనించడం వల్ల అతని ప్రతిభ గురించి నాకు మరింత తెలిసింది అని అమితాబ్ అన్నారు. ధనుష్ ఏ పాత్ర పోషించినా, ఆ పాత్రలోని భావోద్వేగాలకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటాడు. ఇది అతనిలోని ఒక ప్రత్యేక గుణమని బిగ్ బి నమ్ముతారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

ఆర్. బాల్కి దర్శకత్వం వహించిన ‘షమితాబ్’ 2015లో విడుదలైంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె అయిన అక్షర హాసన్ ఈ సినిమాతో కథానాయికగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ధనుష్ తదుపరి చిత్రం కూడా చాలా అంచనాలను రేకెత్తించింది. ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కించిన ఓమ్ చిత్రం ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అడవులలో జరిగే అక్రమ ఎర్రచందనం వ్యాపారం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

అమితాబ్ బచ్చన్..

Amitabh Bachchan, Dhanush

Amitabh Bachchan, Dhanush

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *