Headlines

Allu Arjun: నో మోర్ గాసిప్స్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్ హైలెట్స్ ఇవే

Allu Arjun: నో మోర్ గాసిప్స్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్ హైలెట్స్ ఇవే


ఎట్ ఏ టైమ్.. 600 మంది ఫ్యాన్స్. ఏపీ, తెలంగాణ నుంచే కాదు. కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా అభిమానులు తరలి వచ్చారు. అందునా.. ఓ స్పెషల్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేశారు. ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్. ఆ డయాస్ మీద AAFA అనే పేరు క్లియర్ర్‌గా కనిపించేలా గట్టిగా రాశారు. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ‘AAFA’తో నిండిపోయింది. సో, అల్లు అర్జున్ మాట్లాడే వరకు ఏదో ఉంది, ఏదో జరగబోతోంది అనే లాగే కనిపించింది అక్కడి అట్మాస్పియర్. వన్స్.. అల్లు మాట్లాడ్డం స్టార్ట్ చేశాక చాలా క్యాజువల్‌గా మాట్లాడినట్టు కనిపించింది. నో సెన్సేషన్స్, నో మోర్ గాసిప్స్. మ్యాటర్‌ని చాలా సింపుల్‌గా ముగించేశారు. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఫ్యాన్స్ మీట్‌లో బన్నీ హృదయాలను హత్తుకునే కొన్ని కామెంట్స్ చేశారు. అంతేకాదు.. ఒక మెసేజ్ కూడా పంపించారు. ‘మన హీరోని ఇష్టపడి అభిమానిద్దాం.. తోటి హీరోలను గౌరవిద్దాం’ అని. ఇండస్ట్రీలో ప్రతీ హీరో, మరో హీరోతో ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎటొచ్చీ ఫ్యాన్స్ మధ్యే కాస్త క్లాషెష్ ఉంటాయి. దాన్ని వదిలేద్దాం అని పిలుపునిచ్చారు అల్లు అర్జున్.

హీరోల మధ్య ఉండే అదే ఫ్రెండ్లీ రిలేషన్.. ఫ్యాన్స్ మధ్య కూడా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్క అభిమాని.. ముందుగా వారివారి కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని మోటివేట్ చేశారు. లైఫ్‌లో ఎలా ఉండాలో తన స్టైల్‌లో ఫ్యాన్స్‌కు చిన్న హితబోధ చేశారు అల్లు అర్జున్. ‘మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్లను సింపుల్‌గా వదిలెయ్యండి.. వాళ్లను ట్రోల్‌ చేయడం, ద్వేషించడం, వద్దే వద్దు. వాళ్ల కోసం మీ అమూల్యమైన సమయం, డబ్బు అస్సలు వేస్ట్ చేసుకోకండి. రోజూ మీకు ఉండే ఎనర్జీని మీకోసం, మీ కుటుంబం కోసం, మీ కెరీర్ కోసం వాడండి’ అంటూ ఫ్యాన్స్‌కు ఓ నాలుగు మంచి మాటలు చెప్పారు.
ప్లే బైట్ః

అల్లు అర్జున్‌కి మామూలుగానే కేరళ, కర్నాటక, తమిళనాడులో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘పుష్ప’ ర్యాంపేజ్‌తో క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్లింది. ఏపీ, తెలంగాణతోపాటు కేరళ, తమిళనాడు, కర్నాటక సహా పలు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్స్ క్లబ్స్ పుట్టుకొచ్చాయి. నిజానికి అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో గతంలో ‘AAA’ పేరుతో ఫ్యాన్స్ క్లబ్ ఉండేది. దీన్నికాస్తా AAFAగా మార్చారు. దీనికి సంబంధించిన ఫస్ట్ మీటింగ్ కేరళలో జరిగింది. ఇప్పుడు తెలుగు నేలపై జరిగింది. మున్ముందు ఇతర రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. డైరెక్టుగా అల్లు అర్జునే దీన్ని అనౌన్స్ చేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలా మీట్ అవుతా, అవుదాం అంటూ ప్రామిస్ చేశారు.

ఇవి కూడా చదవండి



ఏదేమైనా.. అల్లు అర్జున్ ఏకబికిన ఆరు గంటల పాటు ఫ్యాన్స్ మధ్య గడపడం నిజంగా పెద్ద విషయమే. అంతేకాదు.. మీటింగ్‌కు వచ్చిన ప్రతి ఒక్క అభిమానితోనూ బన్నీ పర్సనల్‌గా ఫొటో దిగారు. వచ్చిన 600 మంది అభిమానులకు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీ అందించారు. ఈ ఈవెంట్‌లో ఓ అభిమాని.. బన్నీకి పూరి జగన్నాథుని విగ్రహాన్ని బహుకరించేందుకు రాగా.. బన్నీ వెంటనే తన షూస్ తీసి మరీ ఆ విగ్రహాన్ని అందుకున్నారు.

అయితే.. బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనక అసలు ఉద్దేశం ఏంటి? ఇన్ని చెప్పుకున్న తరువాత మళ్లీ క్వశ్చన్స్ రాకూడదు. బట్.. పాజిటివ్‌గా ఆలోచిస్తే మాత్రం.. సోషల్ మీడియా రగడను ఆపడమే మెయిన్ టార్గెట్‌గా కనిపిస్తోంది. ట్రోలింగ్, హేట్ క్యాంపెయిన్లకు దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా, అభిమానుల ఎనర్జీని పాజిటివ్ దిశగా మళ్లించే ప్రయత్నం చేశారు. పైగా ఫ్యాన్స్ కల్చర్‌ను మార్చాలని డిసైడ్ అయినట్టు కనిపించింది. ఇండస్ట్రీలో అందరూ కలిసి ఉంటున్నట్లే.. అందరి హీరోల ఫ్యాన్స్ కలిసి ఉండాలనే మెసేజ్ బలంగా పంపించారు. ‘నచ్చకపోతే వదిలేయండి’ అనే కొత్త నినాదం పుట్టించారు. అంటే.. ఫ్యాన్స్ అసోసియేషన్లను క్రమశిక్షణతో కూడిన పటిష్టమైన కమిటీలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతా అయ్యాక ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘మీరందరూ మరింత గర్వపడేలా మున్ముందు అడుగులు వేస్తా’ అంటూ ముగించారు. సో, ఊహాగానాలకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చేశారు బన్నీ.

వీడియో ఇదిగో..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *