Headlines

Allu Arjun: అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్.. ఒకేసారి రెండు సినిమాలు


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమా నిర్మాణ విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. గతంలో ఒక సినిమా పూర్తి కాగానే మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించే బన్నీ, ఇకపై రెండు చిత్రాలను ఏకకాలంలో చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత సినిమాల మధ్య సమయం ఎక్కువ అవుతోందనే వ్యాఖ్యలు, అలాగే అభిమానుల కోరిక మేరకు అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న రాక సినిమాను పూర్తి చేయడంలో నిమగ్నమై ఉన్న అల్లు అర్జున్, ఆ తర్వాత కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ సినిమాలను పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోయే AA23 షూటింగ్ ప్రారంభం కాగానే, బాసిల్ జోసెఫ్ చిత్రాన్ని కూడా మొదలుపెట్టాలని బన్నీ భావిస్తున్నారు. ఇటీవల ముంబైలో బాసిల్ జోసెఫ్, అరుణ్ అనిరుధన్ బన్నీని కలవడంతో ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుందని స్పష్టమవుతోంది. రెండు సినిమాలను ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్లడం ద్వారా విడుదలల మధ్య సమయాన్ని తగ్గించాలని ఐకాన్ స్టార్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షూటింగ్ అప్‌డేట్స్..ఏ హీరో షూటింగ్ ఎక్కడ జరుగుతోందో తెలుసా..?

Fauzi: ఫౌజీ డేట్ అదేనా.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్ తప్పదా..?

Paradise: ప్యారడైజ్ ఫీవర్.. జడల్ జమానాలో నయా రికార్డ్

కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్లు

బుడ్డోడిని పట్టించుకోరా? సెలక్టర్ల పై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *