యాదాద్రి జిల్లా AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులకు కీలక ప్రకటన వెలువడింది. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 2026 ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ సమయాలను సవరిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.
కొత్త సమయాల ప్రకారం రోగులు ముందుగానే ప్రణాళిక చేసుకుని ఆసుపత్రికి రావాలని సూచించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు OPD రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. శనివారం మాత్రం ఉదయం 8:00 గంటల నుంచి 10:30 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది.
అలాగే కొన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలకు ప్రత్యేక OPD రోజులను కూడా AIIMS ప్రకటించింది.
- బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీః సోమ, మంగళ, గురు, శుక్రవారం
- కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాలుః సోమ, బుధ, శుక్రవారం
- యూరాలజీః సోమ, మంగళ, గురు, శుక్ర, శనివారం
- అన్ని విభాగాల OPD సేవలు సోమవారం నుంచి శనివారం వరకు కొనసాగనున్నాయి.
రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి బయలుదేరే ముందు సంబంధిత విభాగం OPD రోజు, రిజిస్ట్రేషన్ సమయాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని AIIMS బీబీనగర్ ప్రజాసంబంధాల విభాగం సూచించింది. కొత్త సమయాల అమలుతో OPD సేవలు మరింత క్రమబద్ధంగా, వేగంగా అందించే అవకాశం ఉంటుందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. దీంతో ఆగస్టు 1 తర్వాత AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులు కొత్త షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని తమ వైద్య సేవలను పొందాల్సి ఉంటుంది.