Actress Roja: రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై సీనియర్ నటి రీఎంట్రీ.. ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షో టైమింగ్స్ ఇవే

Actress Roja: రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై సీనియర్ నటి రీఎంట్రీ.. ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షో టైమింగ్స్ ఇవే


ఈ వేసవిలో ప్రేక్షకులకు వినోదాన్ని రెట్టింపు చేసేందుకు జీ తెలుగు సరికొత్త కార్యక్రమాలతో సిద్ధమైంది. ఉత్కంఠభరితమైన సీరియల్స్‌తో, కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు.. సెలవుల సీజన్‌ను మరింత సరదాగా మార్చేందుకు మరిన్ని వినోదాత్మ కార్యక్రమాలతో వచ్చేస్తోంది. వెండితెరతోపాటు బుల్లితెరపైనా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో అలరించిన సీనియర్ నటి రోజా ది ఫ్యామిలీ అసెంబ్లీ షోకి హోస్ట్‌గా ప్రేక్షకులను వినోదం పంచేందుకు వచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్, రాజ్యం అనే ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు. నవ్వులు, డ్రామా, అంతులేని వినోదంతో కుటుంబాలను మరింత దగ్గర చేసేందుకు వచ్చేస్తున్న ది ఫ్యామిలీ అసెంబ్లీ షో.. ఏప్రిల్ 19న ఘనంగా ప్రారంభమై ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది, మీ జీ తెలుగులో!

ప్రారంభ ఎపిసోడ్‌లో రోజా తనదైన శైలిలో ఎనర్జిటిక్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మేఘసందేశం సీరియల్ టీమ్ నుంచి గగన్(అభినవ్), భూమి(భూమిక) తమ ఆన్-స్క్రీన్ తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. విద్యార్థులతో సరదా సంభాషణలు, ఆసక్తికరమైన ఆటలు ఈ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలవనున్నాయి. అంతేకాకుండా గాయపడ్డ సింహం సినిమా ప్రమోషన్స్ కోసం హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, జేడీ చక్రవర్తి ఈ షోలో సందడి చేయనున్నారు. రోజా జడ్జ్ పాత్రలో సాగే ఐకానిక్ సెగ్మెంట్ బతుకు జట్కాబండి హాస్యభరితంగా మలిచిన తీరు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించనుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు, ప్రదీప్ రంగనాథన్ బ్లాక్ బస్టర్ హిట్ ‘డ్యూడ్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ఏప్రిల్ 19న సాయంత్రం 6 గంటలకు ప్రైమ్-టైమ్ స్లాట్‌లో జీ తెలుగు వేదికగా ప్రసారం కానుంది. అద్భుతమైన కంటెంట్‌ను అందించడంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. జీ తెలుగు త్వరలో నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రసారం చేయనుంది. హై-వోల్టేజ్ యాక్షన్తో వెండితెర ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా త్వరలోనే జీ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. జీ తెలుగు అందిస్తున్న నాన్స్టాప్ సమ్మర్ ఎంటర్టైన్మెంట్.. ది ఫ్యామిలీ అసెంబ్లీ, డ్యూడ్, అఖండ 2.. మిస్ కాకుండా చూసేయండి!

రోజా ది అసెంబ్లీ ఫ్యామిలీ షో ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *