Actress Poorna: నటి పూర్ణ కూతురి బారసాల ఫంక్షన్.. తన గారాల పట్టికి ఎవరి పేరు పెట్టిందో తెలుసా? ఫొటోస్ వైరల్

Actress Poorna: నటి పూర్ణ కూతురి బారసాల ఫంక్షన్.. తన గారాల పట్టికి ఎవరి పేరు పెట్టిందో తెలుసా? ఫొటోస్ వైరల్


Actress Poorna: నటి పూర్ణ కూతురి బారసాల ఫంక్షన్.. తన గారాల పట్టికి ఎవరి పేరు పెట్టిందో తెలుసా? ఫొటోస్ వైరల్

టాలీవుడ్ నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం ఇటీవల రెండో సారి అమ్మగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. మార్చి 14న ఓ పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పూర్ణ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా తన కూతురు బారసాల వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించింది పూర్ణ. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని చెప్పిన పూర్ణ తన కూతురి ఫొటోలను తొలిసారిగా షేర్ చేసింది. అలాగే తన గారాల పట్టికి పెట్టిన పేరు గురించి చెబుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘జమీలా అనేది నా అమ్మమ్మ పేరు. చిన్నప్పుడే కోల్పోయిన ఆమె జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు గనక కూతురు పుడితే ఆమె పేరే పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. నా బిడ్డను ఒడిలోకి తీసుకున్న ఆ క్షణం.. అమ్మమ్మ నా దగ్గరకు తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. పాప పుట్టడం మా కుటంబానికి అపారమైన ఆనందాన్ని తీసుకొచ్చింది’

‘పాప పుట్టన తర్వాత 28వ రోజున నూలేకెట్టి వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహంచాం. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని చిన్నారికి ఆశీర్వాదాలు అందించారు. హమ్దాన్ పెద్ద అన్నయ్యగా మారి కుటుంబంలో కొత్త బాధ్యతను స్వీకరించాడు. ‘దువా జమీలా’కి కుటుంబం ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి’ అని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది పూర్ణ.

పూర్ణ కూతురి బారసాల ఫంక్షన్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim)

నటి పూర్ణ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు, సినీ అభిమానులు పూర్ణ దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. అలాగే పాప చాలా క్యూట్ గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా 2022లో దుబాయికి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్‌ని పెళ్లి చేసుకుంది. 2023లో ఈ దంపతులకు బాబు పుట్టగా, ఇప్పుడు పాప జన్మించింది.

పూర్ణ కుమారుడి పుట్టిన రోజు వేడుకలు.. వీడియో..

 

View this post on Instagram

 

A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim)

 

View this post on Instagram

 

A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *