Aadhaar Card: మీ మొబైల్ ద్వారానే కుటుంబసభ్యులకు పీవీసీ ఆధార్ ఆర్డర్ చేయొచ్చు.. ఈ సింపుల్ స్టెప్ తెలిస్తే చాలు..

Aadhaar Card: మీ మొబైల్ ద్వారానే కుటుంబసభ్యులకు పీవీసీ ఆధార్ ఆర్డర్ చేయొచ్చు.. ఈ సింపుల్ స్టెప్ తెలిస్తే చాలు..


యూఐడీఏఐ పీవీసీ ఆధార్ కార్డులను అందిస్తోంది. కేవలం రూ.75 చెల్లించి మీరు వీటిని మీరు పొందవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే కేవలం కొద్ది రోజుల్లోనే ఇది మీ ఇంటికి నేరుగా పోస్టల్ శాఖ ద్వారా వచ్చేస్తుంది. అయితే మీ కుటుంబసభ్యులకు మీరు ఫోన్ నుంచే మీరు పీవీసీ కార్డులు ఆర్డర్ పెట్టవచ్చు. మీ మొబైల్ నెంబర్ ద్వారానే వారికి ఆర్డర్ చేయవచ్చు. ఒకే ఫోన్ నెంబర్ ద్వారా మీ కుటుంబసభ్యులందరికీ ఆర్డర్ చేయవచ్చు. అదెలా అంటే..?

ఒకే మొబైల్ నెంబర్‌తో

పీవీసీ ఆధార్ కార్డులు ఆర్డర్ చేయడానికి వారి ఆధార్ నెంబర్‌తో మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. ఏదొక మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. చాలామందికి ఈ విషయం తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. కేవలం ఓటీపీ పొందేందుకు ఏదైనా మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. అలాగే పేమెంట్ కోసం మొబైల్ నెంబర్ అనేది అవసరం. అంతేకానీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాల్సిన అవసరం లేదు.

ఎలా చేయాలంటే..?

యూఐడీఏఐ పోర్టల్‌లోకి వెళ్లాలి. ముందుగా వారి ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేశాక మై మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఏదైనా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఈ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రూ.75 సర్వీస్ ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. పేమెంట్ చేశాక వచ్చే సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ద్వారా మీరు స్టేటస్ తెలుసుకోవచ్చు. వారం పది రోుల్లో కార్డు మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా అందుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *