Headlines

Aadhaar Card: కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్‌తో కొత్త ఆధార్ కార్డులు..? కేంద్రం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్

Aadhaar Card: కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్‌తో కొత్త ఆధార్ కార్డులు..? కేంద్రం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్


ఆధార్ కార్డు వినియోగదారులకు స్పష్టతిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డు డిజైన్‌లో మార్పులు చేయనున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. కార్డు స్వరూపం మారనుందని, కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కనిపించేలా కొత్తవి తీసుకురానున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మార్పులు అమలు చేయనున్నారని, కొత్త కార్డులను జారీ చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఖండించింది. ఆధార్‌లో ఎలాంటి మార్పులకు ప్రణాళిక లేదని ప్రకటించింది.

డిజైన్‌లో మార్పుల్లేవ్..

వార్త నివేదికలు, సోషల్ మీడియా పోస్టులు ప్రజల్లో అవనసరమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని, ప్రజలు అటువంటి వాటిని నమ్మవద్దని కేంద్రం స్పష్టం చేసింది. యూఐడీఏఐ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా, ప్రెస్ ఇన్పర్మేషన్ బ్యూరో ద్వారా జారీ చేసే పత్రికా ప్రకటనల ద్వారా వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించింది. ఈ ఏడాది చివరికల్లా కొత్త కార్డులు తీసుకురానున్నారని, క్యూఆర్ కోడ్, ఫొటో మాత్రమే అందులో ఉంటాయనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. కొత్త కార్డు వస్తే పాత కార్డు పనికిరాదని వార్తలు వస్తున్నాయి. వీటిని కేంద్రం ఖండిస్తూ వివరణ ఇచ్చింది. ఆధార్ డిజైన్‌ మార్చడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం ఉన్న కార్డు చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది. ఎవరూ ఫేక్ న్యూస్‌లను నమ్మి వాటిని షేర్ చేయవద్దని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ తన ప్రకటనలో తెలిపింది. అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, ఇతర సాధనాలు, సోషల్ మీడియాలో వచ్చేవాటిని ప్రజలను నమ్మవద్దని సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మేముందు ధృవీకరణ చేసుకోవాలని పేర్కొంది.

భద్రతా ఫీచర్లు తెచ్చిన యూఐడీఏఐ

కాగా ఆధార్ కార్డులు ఎన్నో ఏళ్ల నుంచి ఉండగా.. ఇప్పటివరకు డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఆధార్ భద్రత కోసం త్వరలో డిజైన్ మార్చుతారనే ప్రచారం జరుగుతోంది. కేవలం దీనిపై ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని, తండ్రి పేరు, అడ్రస్, లింగం, డేట్ ఆఫ్ బర్త్ లాంటి వివరాలు ఉండవని చెబుతున్నారు. దీని వల్ల ఆధార్ దుర్వినియోగం జరిగినా ఇతరులకు వివరాలు తెలియవని అంటున్నారు. ఇటీవల ఆధార్ భద్రతను యూఐడీఏఐ ప్రాధాన్యత ఇస్తోంది. పేపర్ లెస్ ధృవీకరణ ప్రక్రియను ప్రవేశపెట్టింది. గతంలో ఆధార్ ధృవీకరణ కోసం జిరాక్స్ కాపీలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు డిజిటల్ రూపంలో అధెంటికేషన్ చేసుకునేలా కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అలాగే మస్క్‌డ్ ఆధార్, బయోమెట్రిక్స్ లాక్ అనే భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *