భోజనం చేసిన ఒకటి నుండి రెండు గంటల తర్వాత టీ లేదా కాఫీ తీసుకోవడం సముచితం. ఉదయం నిద్రలేచిన తర్వాత టీకి బదులుగా గోరువెచ్చని నిమ్మరసం, ఉసిరి రసం, లేదా రాత్రంతా నానబెట్టిన మెంతులు, జీలకర్ర, లేదా సోంపు గింజలతో చేసిన నీటిని తాగడం మంచిది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్యులు, వివిధ హెల్త్ నివేదికల ఆధారంగా అందిస్తున్నాము. ఏవైనా సందేహాల కోసం నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)