వారం వారం ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం వచ్చిందంటే చాలు రకరకాల సినిమాలు ఓటీటీల్లో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే ఊహించని ట్విస్ట్ లు సినిమాలో చాలానే ఉంటాయి. ఈ సినిమా థియేటర్స్ లో దుమ్మురేపింది. నిజానికి ఇది ఒక తమిళ్ సినిమా కానీ తెలుగులోనూ రిలీజ్ అయ్యి మన దగ్గర కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇంతకూ ఈ సినిమా ఎదో కాదు తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన సీన్.
సూర్యకు జోడీగా అందాల భామ నజ్రియా నజీమ్ నటించగా.. యంగ్ యాక్టర్ నస్లెన్ కీలక పాత్రలో నటించాడు. విభిన్నమైన కథాంశం, ఆసక్తికరమైన సన్నివేశాలు, ఊహించని మలుపులతో ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ముఖ్యంగా సూర్య నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లను సాధించి సత్తా చాటింది. ఈ ఏడాది సీన్ సినిమాతో సూర్య బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్స్ అందుకున్నాడు.
ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ‘సీన్’ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ చిత్రాన్ని డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఒప్పందం జరిగినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4 నుంచి ‘సీన్ ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి