బాలీవుడ్ తారలు కేవలం వెండితెర నటన, బ్రాండ్ ఎండార్స్మెంట్లతోనే ఆగిపోవడం లేదు. తమకున్న పాపులారిటీ, వ్యాపార దృష్టితో ఫ్యాషన్, బ్యూటీ, ఫిట్నెస్, స్పోర్ట్స్, స్టార్టప్ రంగాల్లో భారీ బిజినెస్ సామ్రాజ్యాలను నిర్మిస్తున్నారు. సినిమాల్లో నటిస్తూనే విజయవంతమైన వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న ఐదుగురు బాలీవుడ్ సెలబ్రిటీల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. నటనకు అతీతంగా భారీ వ్యాపారాలను నిర్మించిన ఐదుగురు బాలీవుడ్ సెలబ్రిటీలలో డానీ డెంజోంగ్పా, సునీల్ శెట్టి, జెనీలియా దేశ్‌ముఖ్, కరీనా కపూర్ ఖాన్ తదితరులు ఉన్నారు.
1. షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన సహ-వ్యవస్థాపకుడిగా ఉన్న రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సినిమా నిర్మాణంతో పాటు దేశంలోనే అగ్రశ్రేణి వీఎఫ్ఎక్స్ (VFX) సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దీనితో పాటు ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ లో భాగస్వామ్యం, మర్చండైజ్, పలు స్టార్టప్‌లలో పెట్టుబడులతో షారుఖ్ భారీ వ్యాపార పోర్ట్‌ఫోలియోను నిర్మించుకున్నారు.
2. దీపికా పదుకొణె
నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దీపికా పదుకొణె, స్కిన్‌కేర్ బ్రాండ్ 82°E ద్వారా బ్యూటీ అండ్ వెల్నెస్ రంగంలోకి అడుగుపెట్టారు. అలాగే మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే లైవ్‌లవ్‌లాఫ్ ఫౌండేషన్‌ను నడుపుతున్నారు. కేఏ ఎంటర్ప్రైజెస్ ద్వారా వివిధ స్టార్టప్‌లు, కన్స్యూమర్ బ్రాండ్లలో పెట్టుబడులు పెడుతూ వ్యాపారవేత్తగానూ దూసుకుపోతున్నారు.
3. ప్రియాంక చోప్రా జోనస్
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగిన ప్రియాంక చోప్రా, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార విస్తరణ చేశారు. హెయిర్‌కేర్ బ్రాండ్ అనామలీ , న్యూయార్క్‌లోని రెస్టారెంట్ సోనా, నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్ వంటి వాటితో పాటు టెక్, లైఫ్‌స్టైల్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతూ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలిచారు.
4. అలియా భట్
చిన్న వయసులోనే నటిగా ఉన్నత శిఖరాలను అందుకున్న అలియా భట్, వ్యాపార రంగంలోనూ చురుకుగా ఉన్నారు. పిల్లల దుస్తులు, లైఫ్‌స్టైల్ బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma)ను స్థాపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ బ్రాండ్ రిలయన్స్ రీటైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనితో పాటు ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్, పలు స్టార్టప్‌లలోనూ ఆమె పెట్టుబడులు పెట్టారు.
5. సునీల్ శెట్టి – హాస్పిటాలిటీ & లైఫ్‌స్టైల్
సినిమా , ఫిట్నెస్ రంగాలతో పాటు, సునీల్ శెట్టి భారతదేశంలో H2O ది లిక్విడ్ లాంజ్ వంటి వేదికలతో సహా హాస్పిటాలిటీ , లైఫ్‌స్టైల్ వ్యాపారాలలో తన ఉనికిని చాటుకున్నారు.
6 జెనీలియా & రితేష్ దేశ్‌ముఖ్ ..
ఈ దంపతులు కలిసి భారతదేశంలో పెరుగుతున్న వీగన్ , ఫ్లెక్సిటేరియన్ మార్కెట్‌కు సేవలు అందించే, వినియోగదారులకు నేరుగా విక్రయించే మొక్కల ఆధారిత మాంసం సంస్థ అయిన ఇమాజిన్ మీట్స్‌ను స్థాపించారు.
7 కరీనా కపూర్ ఖాన్ – కొరియన్ చర్మ సంరక్షణ & D2C తాజా ఉత్పత్తులు
కరీనా కపూర్ ఖాన్, షుగర్ కాస్మెటిక్స్ వ్యవస్థాపకులతో పాటు క్వెంచ్ బొటానిక్స్లో సహ-వ్యవస్థాపకురాలిగా చేరారు. D2C తాజా ఉత్పత్తుల బ్రాండ్ అయిన ప్లక్లో ఈక్విటీ వాటాను కలిగి ఉన్నారు.
8 హృతిక్ రోషన్
ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే హృతిక్ రోషన్, తన ఫిట్నెస్ అభిరుచినే వ్యాపారంగా మలిచారు. అథ్లీజర్ బ్రాండ్ హెచ్ఆర్ఎక్స్ (HRX) ద్వారా స్పోర్ట్స్‌వేర్, లైఫ్‌స్టైల్ విభాగంలో మంచి ఆదరణ పొందారు. అలాగే ఆరోగ్య, ఫిట్నెస్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతూ వ్యాపార రంగంలోనూ తన ప్రతిభ చాటుతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..