Headlines

పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తున్నారా..? మీ ఓటు ఏ వార్డులో ఉందో మొబైల్‌లో ఇలా తెలుసుకోండి..


ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం మూడు విడతలుగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 26వ తేదీన తొలి విడత ఎన్నికలు జరగ్గా.. నవంబర్ 29వ తేదీన రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 2వ తేదీన మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుగా ప్రతి ఓటరు తన ఓటు ఏ వార్డులో నమోదై ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఓటు వివరాలను కూడా సులభంగా ఆన్‌లైన్‌లో తెలుసుకునే వెసులుబాటు ఉంది. మీ మొబైల్ ఫోన్ ద్వారానే తనిఖీ చేసుకోవచ్చు. ఇదెలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవడం ఎలా..?

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ sec-ems.ap.gov.in ఓపెన్ చేయండి

-హోమ్ పేజీలో అనేక ఆప్షన్లు కనిపిస్తాయి

-నో యువర్ పోలింగ్ స్టేషన్ ఆప్షన్ ఎంచుకోండి

-“రూరల్ లోకల్ బాడీస్” (Rural Local Bodies) అని ఆప్షన్ ఎంచుకోండి.

-జిల్లా, మండలం, పంచాయతీ వివరాలను ఎంటర్ చేయండి

-మీ EPIC నంబర్‌ను ఎంటర్ చేసి సెర్చ్ చేయండి

-అన్ని వివరాలు సరిగ్గా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి

-సెర్చ్ చేసిన తర్వాత మీ ఓటు వివరాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.

-ఇందులో మీ పేరు, తండ్రి పేరు, మండలం, పంచాయతీ పేరుతో పాటు మీ “వార్డు” (Ward) నంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. మీ ఓటు ఏ వార్డులో ఉందో ఇక్కడ మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు. మీ వివరాలు తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషలలో కనిపిస్తాయి

-మీ వివరాలను ప్రింట్ లేదా PDFగా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు

-క్రింద కనిపించే “ప్రింట్” ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ప్రింట్ అవుతుంది

-తదుపరి ప్రివ్యూ పేజీలో పైన కుడి వైపున ఉండే మూడు చుక్కల ఐకాన్‌పై క్లిక్ చేసి “సేవ్ యాస్ పిడిఎఫ్” ఆప్షన్‌ను ఎంచుకుని మీ మొబైల్‌లో సేవ్ చేసుకోవచ్చు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *