Headlines

AP Panchayat Elections Live: పల్లె పోరులో ఉత్కంఠ.. 3,804 సర్పంచ్ స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్.. లైవ్ వీడియో


ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని పంచాయితీల్లో ఓటు వేసేందుకు జనం క్యూ కట్టారు. రెండో విడతలో 4975 స్థానాలకు నోటిఫికేషన్ జారీ కాగా.. 1095 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 3804 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బరిలో 10 వేల 295 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక వార్డుల విషయానికి వస్తే.. 49 వేల 318 స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. 19 వేల 655 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 29 వేల 603 వార్డుల్లో పోలింగ్ జరుగుతుంది. 63 వేల 395 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 83 లక్షల 52 వేల 338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్న పోలింగ్ జరుగనుంది.. ఆ తర్వాత రెండు గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల లైవ్ అప్డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *