Headlines

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడంటే?


అమరావతి, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్. రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, ప్రాథమిక రాత పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (SLPRB) ప్రకటించింది. ఈ మేరకు నియామక మండలి ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా నవంబరు 26న ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత ప్రింటవుట్‌ను భద్రపరచుకోవాలని సూచించారు. సివిల్ ఎస్‌ఐ, ఏఆర్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) ఎస్‌ఐ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించారు.

ఎస్‌ఐ ఉద్యోగాలకు ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభం: నవంబరు 27, 2026 సాయంత్రం 5 గంటలు.
  • దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 16, 2026 సాయంత్రం 5 గంటలు.
  • ప్రిలిమినరీ రాత పరీక్ష: 2027 ఫిబ్రవరి 28.

ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష సమయాలు

  • ఎస్‌ఐ ప్రాథమిక రాత పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు.
  • పేపర్-1: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.
  • పేపర్-2: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తుల తేదీలు

సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు, అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్‌లు, జైళ్ల శాఖలో వార్డర్ పోస్టులకు కూడా దరఖాస్తుల స్వీకరణ తేదీలను నియామక మండలి ప్రకటించింది.

  • దరఖాస్తుల ప్రారంభం: నవంబరు 27, 2026 సాయంత్రం 5 గంటలు.
  • దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 16, 2026 సాయంత్రం 5 గంటలు.
  • ప్రిలిమినరీ రాత పరీక్ష: 2027 జనవరి 31.
  • కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు ప్రాథమిక రాత పరీక్షను జనవరి 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు.

మరికొన్ని పోస్టుల దరఖాస్తుల తేదీలు త్వరలోనే..

పోలీసు నియామక మండలి మరికొన్ని విభాగాల్లోని ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ తేదీలను త్వరలో ప్రకటించనుంది. వాటిలో పీటీవో, కమ్యూనికేషన్స్ విభాగం ఎస్‌ఐ పోస్టులు, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు, కమ్యూనికేషన్స్ విభాగం కానిస్టేబుల్ పోస్టులు. పీటీవోలో డ్రైవర్, మెకానిక్ పోస్టులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు.. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్‌ను త్వరలో వెల్లడించనున్నట్లు నియామక మండలి తెలిపింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత దాని ప్రింటవుట్‌ను భద్రపరచుకోవాలి. పరీక్షల సిలబస్, హాల్‌టికెట్లు, ఇతర తాజా సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలిస్తూ ఉండాలి.

ఇవి కూడా చదవండి



ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *