Headlines

డిగ్రీ అర్హతతో ఏపీలో 378 ఎస్‌ఐ ఉద్యోగాలు నోటిఫికేషన్‌.. ఎంపికైతే రూ.1.27 లక్షల వరకు జీతం


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (SLPRB AP) 378 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టిపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు 2026 నవంబరు 27 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబరు 16, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

  • ఎస్‌సీటీ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్): 253 పోస్టులు (పురుషులు, మహిళలు)
  • ఎస్‌సీటీ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్): 116 పోస్టులు (పురుషులు, మహిళలు)
  • సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF): 9 పోస్టులు (పురుషులకు మాత్రమే)

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా యూజీసీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు సంబంధిత పోస్టులకు నిర్దేశించిన శారీరక, వైద్య ప్రమాణాలను కలిగి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ఏపీ పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, అవసరమైన వివరాలు నమోదు చేసి, నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.300, ఇతర అభ్యర్థులు: రూ.600 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. అభ్యర్థులను నాలుగు ప్రధాన దశల ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్స్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET), తుది రాత పరీక్ష (Mains) ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,570 నుంచి రూ.1,27,480 వరకు వేతనం ఉంటుంది. ఇతర అలవెన్సులు, సర్వీస్ నిబంధనలు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం వర్తిస్తాయి.

ఎంపిక విధానం ఇలా..

ప్రిలిమినరీ పరీక్షలో మూడు గంటల వ్యవధి కలిగిన రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు ఉంటాయి. పేపర్-1: అంకగణితం, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ. ఎస్‌ఎస్‌సీ స్థాయి, 100 మార్కులు. పేపర్-2: జనరల్ స్టడీస్. డిగ్రీ స్థాయి, 100 మార్కులు. ప్రతి పేపర్‌లోనూ విడివిడిగా అర్హత సాధించాలి. కనీస అర్హత మార్కులు ఇలా ఉన్నాయి. ఓసీ/ఈడబ్ల్యూఎస్ 40 శాతం, బీసీ 35 శాతం, ఎస్సీ/ఎస్టీ 30 శాతం చొప్పున మార్కులు సాధించవల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష మార్కులను తుది ఎంపిక మెరిట్‌లో పరిగణనలోకి తీసుకోరు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక ప్రమాణాల పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఎత్తు, ఛాతీ లేదా బరువు వంటి నిర్దేశిత శారీరక ప్రమాణాలను డిజిటల్ విధానంలో కొలుస్తారు. పోస్టును బట్టి ప్రమాణాలు మారవచ్చు. అనంతరం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) ఉంటుంది. ఈ పరీక్షలో అభ్యర్థులకు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ అనే మూడు రకాల ఈవెంట్లు ఉంటాయి. పోస్టు కోడ్ 11కు 1600 మీటర్ల పరుగు తప్పనిసరిగా పూర్తి చేయడంతో పాటు మిగిలిన రెండు ఈవెంట్లలో ఏదో ఒకదానిలో అర్హత సాధించాలి. పోస్టు కోడ్‌లు 12, 31కు మూడు ఈవెంట్లలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. అనంతరం తుది రాత పరీక్ష (Mains) నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి



తుది రాత పరీక్షలో ఒక్కొక్కటి మూడు గంటల వ్యవధి కలిగిన నాలుగు పేపర్లు ఉంటాయి.

  • పేపర్-1: ఇంగ్లిష్ (డిస్క్రిప్టివ్), 100 మార్కులు.
  • పేపర్-2: తెలుగు లేదా ఉర్దూ (డిస్క్రిప్టివ్), 100 మార్కులు.
  • పేపర్-3: అంకగణితం, రీజనింగ్ (ఆబ్జెక్టివ్).
  • పేపర్-4: జనరల్ స్టడీస్ (ఆబ్జెక్టివ్).
  • పేపర్-1, పేపర్-2 అర్హత పరీక్షలుగా ఉంటాయి.
  • పేపర్-3, పేపర్-4 మార్కులు తుది మెరిట్‌కు పరిగణనలోకి తీసుకుంటారు.
  • పోస్టు కోడ్ 11కు పేపర్-3, పేపర్-4 కలిపి 400 మార్కుల ఆధారంగా తుది మెరిట్ రూపొందిస్తారు. పోస్టు కోడ్‌లు 12, 31కు పేపర్-3, పేపర్-4తో పాటు PET మార్కులను కలిపి మొత్తం 300 మార్కుల ఆధారంగా మెరిట్ నిర్ణయిస్తారు. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 27 నవంబరు 2026
  • దరఖాస్తులకు చివరి తేదీ: 16 డిసెంబరు 2026
  • ప్రిలిమినరీ రాత పరీక్ష: 28 ఫిబ్రవరి 2027

తెలంగాణ ఎస్‌ఐ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *