బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి సినిమా వ్యవహారాలతో కాకుండా, సోషల్ మీడియాలో ప్రచారమైన ఓ వీడియో వివాదంతో ఆయన చర్చనీయాంశంగా మారారు. ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీతో షారుఖ్ ఖాన్ మాట్లాడినట్లుగా చూపిన ఓ వీడియోపై ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ సువిగ్య శర్మకు షారుఖ్ లీగల్ నోటీసులు పంపారు. ముంబైలో జరిగిన గ్లోబల్ పీస్ ఆనర్స్ 2026 కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకలో అనంత్ అంబానీ సద్గురుతో మాట్లాడుతుండగా, షారుఖ్ ఖాన్ ఆ సంభాషణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సువిగ్య శర్మ ఈ వీడియోను షేర్ చేస్తూ, షారుఖ్ ఖాన్ అనంత్ అంబానీని “సైలెంట్‌గా ఉండండి” అని సూచించినట్లు తన రీల్లో కోట్ చేశారు. ఈ వ్యాఖ్యలు షారుఖ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన లీగల్ టీమ్ పేర్కొంది. నవంబర్ 23న పంపిన లీగల్ నోటీసులో, శర్మ వ్యాఖ్యలు నిరాధారమైనవని, అసలు సందర్భాన్ని వక్రీకరించాయని ఆరోపించారు. దీనిపై సువిగ్య శర్మ స్పందిస్తూ, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశమని ప్రతివాదన వినిపించారు. ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
9 ఏళ్ల నిరీక్షణకు తెర.. నంది అవార్డుల పునరుద్ధరణ
Samantha: డెలివరీ వేళ సమంత ఫ్యామిలీలో టెన్షన్ ! అసలు కారణం ఇదే!
Vrushakarma Trailer: 5 వేల ఏళ్ల నాటి రహస్యం.. గూస్బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్
Kaithi: కార్తి రిక్వెస్ట్ చేయడంతో.. హిట్టు సినిమా వదులుకున్న సేతుపతి
పాకిస్థాన్ సిరీస్ ఇష్యూ..నెట్‌ఫ్లిక్స్‌కు భారత సినీ కార్మికుల హెచ్చరిక