ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారులకు శుభవార్త. ఇకనుండి పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ సేవల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఖాతాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ నిధులను సులభంగా వినియోగించుకునేలా కీలక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే యూపీఐ, ఏటీఎంల ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ ను విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ కొత్త సేవ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సదుపాయాన్ని ప్రారంభించేందుకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వంద మందితో ఇప్పటికే భీమ్ యాప్ ద్వారా ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. యూపీఐ ద్వారా ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు అనేది అమలులో ఉన్న పీఎఫ్ ఉపసంహరణ నిబంధనలకు లోబడి ఉంటుంది. దీంతో పాటు, పీఎఫ్ ఖాతాలో కనీసం 25 శాతం నిధులు ఉండాలనే షరతును 10 శాతానికి తగ్గించే మార్పునకు ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఆమోదం తెలిపింది. ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత పీఎఫ్ ను పూర్తిగా ఉపసంహరించుకునేందుకు కూడా సీబీటీ ఆమోదం లభించింది. “ఈపీఎఫ్ఓ 3.0” పేరుతో చేస్తున్న ఈ మార్పులపై 2027 ఫిబ్రవరిలో జరగనున్న సీబీటీ సమావేశంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రిటైర్మెంట్ సమయంలో పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం సొమ్మును ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈ సదుపాయం ద్వారా ఖాతాదారులు నెలవారీగా, మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకోసారి పీఎఫ్ నిధులను తీసుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేద పిల్లల కోసం అమెరికా కార్పొరేట్ దిగ్గజాల పెద్ద మనసు
కాక్రోచ్ జనతా పార్టీ తరహాలో మరో వింత పార్టీ హల్చల్