Headlines

Actress: చిరంజీవితో ఒక్క సినిమాతో సంచలనం.. కట్ చేస్తే.. 63 ఏళ్ల వయసులోనూ తగ్గని గ్లామర్…


ఎనభై, తొంభై దశకాలలో భారతీయ సినీ పరిశ్రమను తన అందం, అభినయం, శాస్త్రీయ నృత్య ప్రావీణ్యంతో మంత్రముగ్ధులను చేసిన హీరోయిన్లలో మీనాక్షి శేషాద్రి ఒకరు. 1963 నవంబర్ 16న జన్మించిన ఆమె, అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తెలుగులో కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆపద్బాంధవుడు చిత్రంలో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ చిత్రంలో హేమ పాత్రలో ఆమె పోషించిన అభినయం, పాటల్లోని నాట్య భంగిమలు నేటికీ సినీ ప్రియులకు గుర్తుండిపోతాయి. ఈ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. ఇందులో అచ్చమైన తెలుగింటి అమ్మాయిల కనిపించింది మీనాక్షి. ఈ సినిమాతో ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఎక్కువ మంది చదివినవి: Akkineni : అన్నపూర్ణ సంస్థకు ఈ సినిమా చాలా ప్రత్యేకం.. 1967లో బాక్సాఫీస్ షేక్ చేసిన అక్కినేని మూవీ ఇదే..

మీనాక్షి శేషాద్రి అసలు పేరు శశికళ శేషాద్రి. చిన్నప్పటి నుంచే భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ వంటి శాస్త్రీయ నృత్య రీతుల్లో శిక్షణ పొందిన ఆమె, 1981లో కేవలం 17 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా కిరీటం గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 1983లో వచ్చిన హీరో చిత్రంతో బాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆపై ఘాయల్, దామిని, ఘటక్ వంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్య విజయాలను సొంతం చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి: Jaya Prada : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. చాలా మంచి వ్యక్తి.. హీరోయిన్ జయప్రద..

కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నప్పుడే 1995లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ హరీష్ మైసూర్‌ను వివాహం చేసుకున్న మీనాక్షి శేషాద్రి, ఆ తర్వాత క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. అమెరికాలో స్థిరపడి పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే, అక్కడ డ్యాన్స్ స్కూల్ స్థాపించి ఎంతో మందికి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. సినీ రంగానికి దూరంగా ఉన్నప్పటికీ, ఆమె ఫోటోలు, పాత జ్ఞాపకాలు సోషల్ మీడియాలో వచ్చినప్పుడల్లా అభిమానులు ఆసక్తిగా పంచుకుంటూ ఉంటారు. వయసు పెరుగుతున్నా తనదైన సౌందర్యం, హుందాతనంతో అభిమానులను ఆకట్టుకుంటున్న మీనాక్షి శేషాద్రి ప్రస్థానం ఎంతోమంది కళాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఆమె చేసిన చిత్రాలు, ఆనాటి మధుర జ్ఞాపకాలు సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

మీనాక్షి శేషాద్రి..

ఎక్కువ మంది చదివినవి: Raghu Babu : కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దేవుడు ఆయనే.. ఒక్క సినిమాతో 25 ఏళ్ల ఆస్తులు అమ్ముకున్నాం..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *