Headlines

హైదరాబాద్‌లో ఫస్ట్ అఫిషియల్ APPLE స్టోర్.. గ్రాండ్ ఓపెనింగ్‌కి ముహూర్తం ఫిక్స్ !


ప్రముఖ టెక్ దిగ్గజం “ఆపిల్”కి మార్కెట్లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ కంపెనీ ప్రొడక్ట్స్ లలో ఐ ఫోన్ లకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో డిమాండ్ ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఐ ఫోన్ నుంచి కొత్త సిరీస్ లను లాంఛ్ చేస్తూ లక్షల మంది వినియోగదారులను సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా కొత్త ఫోన్ లాంఛ్ సమయంలో ఏ రేంజ్ లో హడావిడి ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ కి ముందు రోజు నుంచే స్టోర్ల వద్ద కస్టమర్లు పడిగాపులు కాస్తున్న కాసిన వీడియోలు ఇప్పటికే ఎన్నో సార్లు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాసులకు ఈ సంస్థ గుడ్ న్యూస్ ప్రకటించింది.

హైదరాబాద్‌లో ఫస్ట్ అఫిషియల్ స్టోర్..

కాగా ఆపిల్ హైదరాబాద్‌లో తమ తొలి అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు డిసెంబర్ 10వ తేదీన కూకట్‌పల్లిలోని లేక్‌షోర్-వై జంక్షన్ మాల్‌లో Apple Kukatpally స్టోర్ వినియోగదారులకు అందుబాటులోకి రానుందని అనౌన్స్ చేసింది. అందులో భాగంగానే ఈ కొత్త స్టోర్‌కు సంబంధించిన ప్రత్యేక బ్యారికేడ్ డిజైన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. హైదరాబాద్‌కు ఉన్న ‘సిటీ ఆఫ్ పెర్ల్స్’ పేరును గుర్తు చేసేలా ముత్యాల స్ఫూర్తితో ఈ లోగో డిజైన్‌ చేయడం అందరినీ ఆకట్టుకుంటుంది. భాగ్యనగరానికి ప్రపంచవ్యాప్తంగా ముత్యాల వ్యాపారంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.

భారత్‌లో ఏడో రిటైల్ స్టోర్..

ప్రస్తుతం భారత్‌లో ఆపిల్‌కు ఆరు అధికారిక రిటైల్ స్టోర్లు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న Apple Kukatpally ఈ జాబితాలో ఏడో స్టోర్‌గా చేరనుంది.

  • ముంబై – Apple BKC, Apple Borivali
  • ఢిల్లీ- Apple Saket, Apple Noida
  • బెంగళూరు – Apple Hebbal
  • పుణే – Apple Koregaon Park

ఈ స్టోర్ల‌లో ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్, ఆపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్‌తో పాటు కంపెనీకి చెందిన అన్నీ రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. అంతే కాకుండా ప్రొడక్ట్స్ అమ్మకాలు మాత్రమే కాకుండా వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడంపై కూడా ఆపిల్ దృష్టి పెట్టింది. సాంకేతిక సమస్యలకు సహాయం అందించడంతో పాటు వ్యాపార వినియోగదారుల కోసం ప్రత్యేక బృందం కూడా సేవలందించనుంది.

Apple Store Kukatpally

Apple Store Kukatpally

ఫ్రీ ట్రైనింగ్ సెషన్స్..

మరోవైపు ఈ స్టోర్‌లలో ‘Today at Apple’ పేరుతో ప్రతిరోజూ ఫ్రీ సెషన్స్ నిర్వహించనున్నారు. ఇందులో ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌తో అద్భుతమైన ఫొటోలు, వీడియోలు ఎలా తీయాలి.. సహా పలు అంశాల్లో నైపుణ్యాలను ఎలా పెంచుకోవాలి? అనే విషయాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *