Headlines

Vijayawada: విజయవాడలో ‘సైలెంట్ పార్టీ’ కలకలం.. వీధివీధినా పోస్టర్లు..


Vijayawada: విజయవాడలో ‘సైలెంట్ పార్టీ’ కలకలం.. వీధివీధినా పోస్టర్లు..

విజయవాడ నగరంలో ‘సైలెంట్ పార్టీ’ పేరుతో వెలుస్తున్న పోస్టర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత రెండు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో గోడలపై ఈ పోస్టర్లు కనిపిస్తుండటంతో స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. వీధుల్లో పోస్టర్లు వేయడమే కాకుండా.. సోషల్ మీడియా వేదికలైన ఎక్స్ (X), ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ పేరుతో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, పోస్టర్లపై క్యూఆర్ కోడ్‌ కూడా ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సైలెంట్ పార్టీ పేరుతో సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఖాతా ప్రొఫైల్ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పంది ముఖానికి సంబంధించిన మాస్క్ ధరించిన వ్యక్తి తలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ ఖాతా ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? దీని వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. ఎక్స్ ఖాతాలో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను మాత్రమే ఫాలో అవుతుండటం కూడా ఆసక్తికరంగా మారింది.

సైలెంట్ పార్టీ పేరుతో ప్రచారంలోకి వస్తున్న పోస్టులు, ఆడియోలు కూడా చర్చకు కారణమవుతున్నాయి. AI సాయంతో రూపొందించిన ఆడియోల ద్వారా రాజకీయ నాయకుల ప్రసంగ శైలిని అనుకరిస్తూ విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్నది మాత్రం స్పష్టత లేదు. నగరంలోని పబ్లిక్ ప్లేసుల్లో కనిపిస్తున్న పోస్టర్లపై క్యూఆర్ కోడ్‌ను కూడా ముద్రించారు. దీని ద్వారా డబ్బులు వసూలు చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ నిధుల సేకరణ ఎవరికి సంబంధించినది? ఏ ప్రయోజనం కోసం చేస్తున్నారు? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by silent political party (@silentpoliticalparty)

రెండు రోజులుగా నగరంలోని పలు వీధుల్లో పోస్టర్లు కనిపిస్తుండటంతో పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు అంటించిన వ్యక్తులు ఎవరు? వాటిని ఎవరు రూపొందించారు? సోషల్ మీడియా ఖాతాలను ఎవరు నిర్వహిస్తున్నారు? అనే కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రచారం వెనుక వ్యక్తులు లేదా బృందం ఎవరన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

మొత్తంగా విజయవాడలో ‘సైలెంట్ పార్టీ’ పేరుతో సాగుతున్న ఈ ప్రచారం వెనుక అసలు కథ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. వింత పోస్టర్లు, AI ఆడియోలు, క్యూఆర్ కోడ్‌తో సాగుతున్న ఈ వ్యవహారంపై నగరవాసుల్లో చర్చ కొనసాగుతోంది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *