Headlines

పెళ్లి ఎవరిదైనా విందు మనదే అనుకుంటున్నారా..? ఇకపై దిమ్మతిరిగిపోద్ది.. జాగ్రత్త..


కార్తీకమాసం వచ్చిందంటే పెళ్లిళ్ల సందడి మామూలుగా ఉండదు.. ఎక్కడ చూసినా కళ్యాణ మండపాలు, పెళ్లి బాజాలు, విందు భోజనాలే కనిపిస్తాయి. ఈ మాసంలో లక్షలాది జంటలు ఒక్కటవుతుంటాయి. అయితే పెళ్లిళ్ల సందడితో పాటు ఇప్పుడు మరో కొత్త సమస్య తెరపైకి వచ్చింది. ఆహ్వానం లేకుండానే పెళ్లిళ్లకు వచ్చి భోజనాలు చేసి వెళ్లే పిలవని అతిథుల బెడద పెరిగిపోయింది.

పెళ్లిళ్ల సీజన్‌లో ఒకే రోజు పలు ఫంక్షన్లు జరుగుతుండటంతో కొందరు ఆహ్వానం లేకుండానే కళ్యాణ మండపాలకు వచ్చి భోజనాలు చేసి వెళ్తున్నారు. దీంతో పెళ్లి నిర్వాహకులకు అదనపు ఖర్చులు, భోజనాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పిలవని అతిథుల బెడదను అరికట్టేందుకు వనపర్తిలోని ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఓ వినూత్న చర్యకు దిగింది.

ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వచ్చి భోజనం చేసే వారిని హెచ్చరిస్తూ ఏకంగా ఓ ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్‌కు సంబంధం లేని వ్యక్తులు వచ్చి భోజనం చేస్తే సెక్షన్ 441 ప్రకారం… ప్రస్తుతం అమల్లో ఉన్న BNS సెక్షన్ 329 కింద చర్యలు తీసుకుంటామని బోర్డులో పేర్కొన్నారు. ఈ సెక్షన్ ప్రకారం.. నేరం రుజువైతే.. మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు..

ఆహ్వానం లేకుండా పెళ్లి విందులకు వెళ్లేవారిని కట్టడి చేసేందుకు ఫంక్షన్ హాల్ యాజమాన్యం చేసిన ఈ ప్రయత్నం ఆసక్తికరంగా మారింది. పెళ్లి ఎవరిదైనా… విందు మాత్రం అందరిదీ అనుకునే వారికి ఈ ఫ్లెక్సీ గట్టి హెచ్చరికే మరీ.. అయితే.. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *