Headlines

గాజు గ్లాసులు, గిన్నెలు తళతళ మెరవాలంటే.. ఈ 4 చిట్కాలు తెలుసుకోండి!


గాజు గ్లాసులు, గిన్నెలు తళతళ మెరవాలంటే.. ఈ 4 చిట్కాలు తెలుసుకోండి!

ఇంటికి ప్రత్యేక అతిథులు వచ్చినప్పుడు లేదా వేడుకల సమయంలో అందమైన గాజు పాత్రలను ఉపయోగించడానికి చాలామంది ఇష్టపడతారు. మెరిసే గాజు గ్లాసులు, గిన్నెలు, సర్వింగ్ బౌల్స్ డైనింగ్ టేబుల్ అందాన్ని పెంచుతాయి. అయితే కాలక్రమేణా గాజు పాత్రలపై నీటి మరకలు, మసకబారడం, తెల్లటి గీతలు కనిపించి వాటి నిగారింపు తగ్గుతుంది. మీ ఇంట్లోని గాజు పాత్రలు పాతవిగా మారి మెరుపు కోల్పోతే, వాటిని తిరిగి శుభ్రంగా, ప్రకాశవంతంగా మార్చడానికి కిచెన్‌లోని కొన్ని సాధారణ వస్తువులే సరిపోతాయి.

మొండి మరకలకు వేడి నీరు, సబ్బు, అమ్మోనియా

గాజు జార్లు లేదా గ్లాసుల లోపల మొండి మరకలు, మురికి పేరుకుపోయినప్పుడు వేడి నీటిలో కొద్దిగా సబ్బు ద్రవం కలపాలి. అందులో కొన్ని చుక్కల అమ్మోనియా వేసి ఆ మిశ్రమంతో పాత్రలను శుభ్రం చేస్తే, లోపల పేరుకుపోయిన మరకలు సులభంగా తొలగిపోతాయి.

చిన్న నోరు ఉన్న పాత్రలకు ఉప్పు, వెనిగర్

సన్నని లేదా చిన్న నోరు ఉన్న గాజు సీసాలు, పాత్రలను లోపలి వైపు శుభ్రం చేయడం కష్టంగా ఉంటుంది. అలాంటి వాటిలో కొద్దిగా ఉప్పు, వెనిగర్ వేసి బాగా కదిలించి కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే మసకబారడం తగ్గి పాత్రలు స్పష్టంగా, మెరుస్తూ కనిపిస్తాయి.

సహజ క్లీనర్‌గా నిమ్మ తొక్కలు

నిమ్మ తొక్కలు సహజసిద్ధమైన క్లీనర్‌గా పనిచేస్తాయి. నీటిలో నిమ్మ తొక్కలను వేసి, ఆ నీటితో గాజు పాత్రలను కడిగితే వాటికి మంచి మెరుపు వస్తుంది. అంతేకాకుండా పాత్రలలో ఉండే ఎలాంటి దుర్వాసన అయినా సులభంగా తొలగిపోతుంది.

బేకింగ్ సోడాతో నిగారింపు

గాజు వస్తువులను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా కూడా ఎంతో మేలు చేస్తుంది. నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి గాజు పాత్రలను కడగడం వల్ల పేరుకుపోయిన మురికి వదిలి, వాటి సహజమైన మెరుపు దీర్ఘకాలం నిలుస్తుంది. ఈ సులభమైన చిట్కాలతో ఖరీదైన క్లీనర్లు లేకుండానే గాజు పాత్రలను కొత్తవాటిలా ఉంచుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *