Headlines

ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం.. పోలింగ్ ప్రారంభం.. లైవ్ వీడియో ఇదిగో..


ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ, మలి విడత మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏపీలో 3,240 పంచాయతీలు, 23 పట్టణ స్థానిక సంస్థల్లో గురువారం  ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. అలాగే.. 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో పోలింగ్‌ కొనసాగుతోంది.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 30న కౌంటింగ్‌ జరగనుంది.

తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు..

26 జిల్లాల్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో 3 వేల 949 సర్పంచ్ స్థానాలకు SEC ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో 760 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 3 వేల 189 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 39 వేల 832 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 14 వేల 731 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 25 వేల 57 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌కు SEC ఏర్పాట్లు చేసింది. 709 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలన్నీ ఏకగ్రీవం అయినట్టు SEC ప్రకటించింది. ఎన్నికల కోసం 31 వేల 614 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.

బరిలో 170 మంది అభ్యర్థులు..

4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో మేయర్, చైర్‌పర్సన్ పదవులకు 170 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3 వేల 362 మంది ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. మొత్తం 5 వేల 602 సీసీ కెమెరాలతో పోలింగ్ స్టేషన్లలో నిఘా ఏర్పాటు చేశారు. 819 సున్నితమైన, 597 అత్యంత సున్నితమైన పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *