Headlines

డెల్ కంపెనీలో నెలకు రూ.30 వేల జీతం.. నటన కోసం వదిలేసి సంవత్సరానికి అంతే సంపాదించా.. టాలీవుడ్ నటుడు..


తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటుడు అభినవ్ గోమఠం. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యువతకు విశేషంగా చేరువైన ఆయన, ఇటీవల విడుదలైన సీక్వెల్ ‘ఈఎన్‌ఈ రిపీట్’ (ఈ నగరానికి ఏమైంది 2) విజయంతో మరోసారి ప్రశంసల వర్షం అందుకుంటున్నారు. ఈ చిత్రంలో కౌశిక్ పాత్రలో మరోసారి మెప్పించిన అభినవ్, తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో తన సినీ ప్రస్థానం, ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, పట్టుదల గురించి పంచుకున్న భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సక్సెస్ మీట్ వేదికపై అభినవ్ గోమఠం మాట్లాడుతూ, ఒకప్పుడు తాను డెల్ సంస్థలో ఉద్యోగం చేసేవాడినని, అప్పట్లో నెలకు రూ.30 వేల వేతనం వచ్చేదని గుర్తుచేసుకున్నారు. అయితే సినిమాలు, నటనపై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీ వైపు అడుగుపెట్టారని చెప్పారు.

ఉద్యోగం మానేసిన తర్వాత తొలినాళ్లలో ఆదాయం బాగా తగ్గిపోయి, ఏడాది మొత్తానికి కేవలం రూ.30 వేలు సంపాదించే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అంతటి కష్టకాలం వచ్చినా వెనక్కి తగ్గకుండా నటననే నమ్ముకుని ముందుకు సాగినందుకు తనకు తానే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని చెప్పారు. సినిమాల్లో అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలను గుర్తుచేసుకున్న అభినవ్, తాను థియేటర్ ఆర్టిస్ట్‌గా పనిచేశానని, నాటకరంగంలో శ్రమించడం ఎంతో కఠినంగా ఉంటుందని వివరించారు. ఎండైనా, వానైనా లెక్కచేయకుండా అనేక ఆడిషన్లకు వెళ్లేవాడినని, కొందరు దర్శకులు కలిసి పనిచేద్దామని చెబుతున్నా అవకాశాలు మాత్రం వచ్చేవి కావని తెలిపారు. కష్టపడి, అవమానాలు, నిరుత్సాహపరిచే మాటలను దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నందుకు తన ప్రయాణంపై గర్వంగా ఉందని స్పష్టం చేశారు.

‘ఈఎన్‌ఈ రిపీట్’ సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో పదే పదే చూస్తూ విజయం అందించడంపై అభినవ్ సంతోషం వ్యక్తం చేశారు. కేవలం ఐదు రోజుల్లోనే రెండు, మూడు సార్లు సినిమా చూశామని అభిమానులు మెసేజ్‌లు పంపడం చూస్తుంటే అసలైన మార్కెట్ ప్రేక్షకులేనని అర్థమవుతోందన్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి మాట్లాడుతూ, బయట వినిపించే మాటలకు భిన్నంగా ఆయన వ్యక్తిగతంగా ఎంతో కూల్‌గా ఉంటారని, సెట్స్‌లో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

అభినవ్ గోమఠం..

ఎక్కువ మంది చదివినవి: Raghu Babu : కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దేవుడు ఆయనే.. ఒక్క సినిమాతో 25 ఏళ్ల ఆస్తులు అమ్ముకున్నాం..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *