Ketu Gochar 2026: జ్యోతిష్య శాస్త్రంలో కేతువును ఛాయా గ్రహంగా, పాప గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం ఆకస్మిక పరిణామాలు, ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యం, అనూహ్య మార్పులకు కారకుడిగా చెబుతారు. కేతువు సుమారు 18 నెలలకు ఒకసారి రాశి మారుస్తుంటాడు. ఈ క్రమంలో డిసెంబర్ 5, 2026న సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. 2027 సంవత్సరం మొత్తం ఇదే రాశిలో కొనసాగనున్నాడు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. చంద్రుడి ఆధిపత్యంలోని ఈ రాశిలో కేతువు సంచరించడం వల్ల అన్ని రాశులపైనా ఎంతోకొంత ప్రభావం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సంచారం వల్ల మూడు రాశుల వారికి ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయం పెరగడం, బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడటం, ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభించడం వంటి ఫలితాలు అనుభవానికి వస్తాయి.
వృషభ రాశి (Taurus)
కర్కాటక రాశిలో కేతువు సంచారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు మంచి అవకాశాలు లభిస్తుంది. గతంలో ఎక్కువగా శ్రమించిన పనులు ఇప్పుడు సులభంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారాలకు సంబంధించి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా మరింత బలపడతారు. మొత్తంగా రాబోయే 18 నెలలు వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉండే అవకాశముంది.
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి కేతువు సంచారం సానుకూల మార్పులను తీసుకొస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడటంతో పాటు కొత్త అవకాశాలు అందివస్తాయి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో ఎదురైన కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. కెరీర్లో ముందుకు వెళ్లేందుకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగ మార్పు లేదా కొత్త బాధ్యతల కోసం ప్రయత్నించేవారికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.
ఇవి కూడా చదవండి
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి వారికి కేతువు సంచారం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండనుంది. ముఖ్యంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో మీకు ఎదురవుతున్న ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరపడేందుకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. రాబోయే 18 నెలలు కుంభ రాశి వారికి అనేక విధాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంది.
(గమనిక: ఈ కథనంలోని అంశాలు జ్యోతిష్య అంచనాలు, నమ్మకాల ఆధారంగా అందించినవి. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. ఈ అంచనాలు ఖచ్చితంగా నిజమవుతాయని నిరూపించేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు)