Headlines

రోజుకు లక్ష రెమ్యునరేషన్.. మంచంపై డబ్బు కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాథలా..


తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన సిల్క్ స్మిత జీవితం గురించి అనేక విషయాలు పంచుకున్నారు సీనియర్ నటి డిస్కో శాంతి. ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను, అప్పట్లో తనతో మాట్లాడి తెలుసుకున్న విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే అప్పట్లో ఇండస్ట్రీలో సిల్క్ స్మిత అంటే ఉన్న క్రేజ్.. అప్పట్లో ఆమె అసాధారణమైన పారితోషికం, ఆమె విభిన్న జీవనశైలి, సెట్‌లో ఆమె వ్యక్తిత్వం గురించి అనేక విషయాలు వెల్లడించారు. డిస్కో శాంతి మాట్లాడుతూ.. సిల్క్ స్మిత తన కెరీర్ పీక్ దశలో రోజుకు లక్ష రూపాయల నుండి రెండు, మూడు లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకునేవారని అన్నారు. అంటే అప్పట్లో ఒక రోజుకు లక్ష రూపాయలంటే అది చాలా పెద్ద మొత్తమని, పది సంవత్సరాలు దాటిన తర్వాత గానీ అలాంటి పారితోషికాలు కనిపించలేదని వారు గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి: Akkineni : అన్నపూర్ణ సంస్థకు ఈ సినిమా చాలా ప్రత్యేకం.. 1967లో బాక్సాఫీస్ షేక్ చేసిన అక్కినేని మూవీ ఇదే..

ఆమె సంపాదన ఎంత భారీగా ఉండేదంటే, సంపాదించిన డబ్బును మంచంపై పరుచుకుని, దానిపై పడుకునేవారనే ఒక విలక్షణమైన అలవాటు ఆమెకు ఉండేదని తెలిపారు. ఈ మాటలు విన్నప్పుడు చాలామందికి నమ్మశక్యంగా లేకపోయినా, ఆమె స్వయంగా తనకు చెప్పారని అన్నారు. సిల్క్ స్మిత కేవలం భారీగా సంపాదించడమే కాకుండా, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అదే స్థాయిలో ఖర్చు చేసేవారు. నెలకు ఐదు లక్షల రూపాయల అద్దె ఇంటిలో నివసిస్తూ, ఆ ఇంటికి అవసరమైన ఇంటీరియర్ డెకరేషన్‌కు, ఇతర సౌకర్యాలకు భారీగా ఖర్చు చేసేవారని తెలిపారు. ఒక ఇల్లు కొనేంత డబ్బును అద్దెకు, ఇంటిని అలంకరించడానికి ఖర్చు చేసేవారంటే ఆమె జీవనశైలి ఎంత రాజసంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కువ మంది చదివినవి: Jaya Prada : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. చాలా మంచి వ్యక్తి.. హీరోయిన్ జయప్రద..

ఆమె వృత్తిపరమైన జీవితం కూడా ప్రత్యేకమైనదే. ఆమె పట్ల సెట్‌లో అందరికీ అపారమైన గౌరవం ఉండేది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సైతం “మేడమ్ రెడీ” అని చెప్పడానికి ఆమె దగ్గరకు వెళ్లడానికి కొంత సంశయించేవారని, ఆమె పక్కనే ఉన్నా చెప్పడానికి భయపడేవారని అన్నారు. ఈ గౌరవం ఆమె కెరీర్ చివరి వరకు కొనసాగిందని, ఆమె మరణించినప్పుడు కూడా రాణిలాగే కన్నుమూశారని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. స్మిత మంచి స్వభావం గురించి అందరూ మాట్లాడేవారని, ఆమె గురించి ఎప్పుడూ చెడుగా ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు. ఆమెకు తనదైన ఒక స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ ఉండేవని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

సిల్క్ స్మిత..

Silk Smitha

Silk Smitha

ఎక్కువ మంది చదివినవి: Raghu Babu : కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దేవుడు ఆయనే.. ఒక్క సినిమాతో 25 ఏళ్ల ఆస్తులు అమ్ముకున్నాం..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *