డిసెంబర్ గ్రహ సంచారం ప్రకారం కొన్ని రాశుల వారికి దశమ స్థానం, అంటే ఉద్యోగ స్థానం బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అవకాశాలు లభించడం, ఉద్యోగులకు డిమాండ్ పెరగడం, ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకోవడం, ఉద్యోగంలో స్థిరత్వం లభించడం, ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం కావడం వంటివి ఈ రాశుల వారికి జరిగే అవకాశముంది. ప్రభుత్వ, విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారికి కూడా నెలాఖరులోగా ఉద్యోగం లభించే సూచనలున్నాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశులకు ఉద్యోగ సంబంధమైన ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది.